ఆఖరిమాట మొదటిమాట
ఆశలకేం అనంతం
ఆకాశం నా గుడారం
అ ఆలు నా ఆస్తి
ఆసియా అంతవాణ్ణి
ఆశలకేం అనంతం
అప్పారావు నా నేస్తం
ఆంధ్రతం నా శాపం
విశాఖపట్టనం వూరు
వెర్రాసుపత్రి పేరు
ఆఖరిమాట మొదటిమాట
ఆశలకేం అనంతం
ఆసియా అంతవాణ్ణి
ఆశలకేం అనంతం
అమాంతంగానే కాదండయ్యా క్రమంగా క్రక్రమంగా నా
సమస్తం మీ సమక్షంలో సమర్పిస్తా శ్రమిస్తే
కపాలం నవితేనేం కంపింపింబింబింపిస్తా! నీ
ప్రపంచాన్నే, పాటల్లో ఆటల్లో నా మాటల్లో
ఇదే నా రహస్యం
యథార్ధం నా తరువు
నా కేమున్నాయిలే ఆసులా రాజులా రాణీలా
జాకీలా క్షణకాలం జెండా ఎగిరించేస్తాం
ఆ కొంచెం చాలదంటే సైనైడుకూడా కొంచెమే కా
దంటే కాదనండయ్యా అన్నయ్యలారా
పరమాణువు నా ప్రపంచం
నాతో నా గుణకారం
క్షణాన్నే సాగదీస్తే కాలం డొంకంతా కదల్దా
ఇలాగే ఎక్కేద్దాం శిఖరం కొత్త రాస్తాలు తీస్తూ
మిలిట్రీ లారీ నడిపించే పద్ధతిలో పద్ హతితోనే
అణాలు అరణ్యాలు అణువుళూ అద్రులూ దాటుకుంటూ
ఆవేగం నా వేగం
ఆసియాలకేం అనల్పం
వికృతం శుంఠాయమానంగా కనబడితేనేం
ఒకానొక ఋజుతం సాధిస్తాం మనం లోపా
యికారీ వ్యాపారాల్లో పాల్గొంటామా చేస్తే
అకస్మాత్తుగా ఓపెన్ గా చేస్తాం లేకపోతే నిద్రపోతాం
సప్నంలో సర్గం
హతాశయాలకి పొటాసియాలు
హిప్పోపొటామస్ హిట్లర్ హిండెన్ బర్గు హిడింబా
హిరణ్యాక్ష రాజ్యాలూ ఇవన్నీ ఎందుకోయ్ హ్రీ హ్రీ
శ్రీతో శ్రీ శ్రీశ్రీతో శ్రీశ్రీ శ్రీశ్రీశ్రీతో శ్రీశ్రీశ్రీ
శిఖరంపై జెండా శిలలకి ప్రాణం చీనీతో చీనాతో స్నేహం
ఆఖరి మాట మొదటిమాట
ఆశలకేం అనంతం
అప్పారావు నా నేస్తం
ఆంధ్రతం నా శాపం
ఆశయం అంతవాణ్ణి
ఆశలకేం అనంతం
ఆఖరిమాట మొదటిమాట
ఆశలకేం అనంతం
అప్పారావంత వాణ్ణి
ఆశలకేం అనంతం
No comments yet.