Main Menu

Aayuraarogya Puthrartha Sampadhalanni (ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్ని)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. ఆయురారోగ్య పు – త్రార్థ సంపదలన్ని
కలుగజేసెడి భార – కర్త వీవె
చదువు లెస్సగ నేర్పి – సభలో గరిష్ఠాధి
కార మొందించెడి – ఘనుడ వీవె
నడక మంచిది పెట్టి – నరులు మెచ్చేడునట్టి
పేరు రప్పించెడి – పెద్ద వీవె
బలువైన వైరాగ్య – భక్తిఙ్ఞానములిచ్చి
ముక్తి బొందించెడు – మూర్తి వీవె

తే. అవనిలో మానవుల కన్ని – యాసలిచ్చి
వ్యర్థులను జేసి తెలిపెడి – వాడ వీవె.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహస్వామీ! ఆయురారోగ్య ఐశ్వర్యాది పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే కర్తవు నీవే! చదువుసంధ్యలు బాగుగా నేర్పి పండితునిగా జేసి సభలలో మంచి పదవి,మెప్పు పొందునట్లు చేయువాడవు నీవే! మంచి గుణగణములు, సత్ప్రవర్తననిచ్చి పేరు ప్రఖ్యాతులనిచ్చే తండ్రివి నీవే!గొప్పదైన భక్తి వైరాగ్యజ్ఞానములనిచ్చి ముక్తినందించే మూర్తివి నీవే! మానవులకెన్నో యాశలు కల్పించి ఆ యాశలచే వ్యర్థులను చేయువాడవు నీవే! ఓ నరశింహా! చల్లగా కావుము తండ్రీ!
.


Poem:
See. Aayuraarogya Pu – Traartha Sampadalanni
Kalugajesedi Bhaara – Karta Veeve
Chaduvu Lessaga Nerpi – Sabhalo Garishthaadhi
Kaara Momdimchedi – Ghanuda Veeve
Nadaka Mamchidi Petti – Narulu Mechchedunatti
Peru Rappimchedi – Pedda Veeve
Baluvaina Vairaagya – Bhaktignyaanamulichchi
Mukti Bomdimchedu – Moorti Veeve

Te. Avanilo Maanavula Kanni – Yaasalichchi
Vyarthulanu Jesi Telipedi – Vaada Veeve.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. aayuraarOgya pu – traartha saMpadalanni
kalugajEseDi bhaara – karta veeve
chaduvu lessaga nErpi – sabhalO gariShThaadhi
kaara moMdiMcheDi – ghanuDa veeve
naDaka maMchidi peTTi – narulu mechchEDunaTTi
pEru rappiMcheDi – pedda veeve
baluvaina vairaagya – bhaktignyaanamulichchi
mukti boMdiMcheDu – moorti veeve

tE. avanilO maanavula kanni – yaasalichchi
vyarthulanu jEsi telipeDi – vaaDa veeve.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.