పద్యం:
సీ. అడవిపక్షుల కెవ్వ – డాహార మిచ్చెను
మృగజాతి కెవ్వడు – మేతబెట్టె
వనచరాదులకు భో – జన మెవ్వ డిప్పించె
జెట్ల కెవ్వడు నీళ్ళు – చేదిపోసె
స్త్రీలగర్భంబున – శిశువు నెవ్వడు పెంచె
ఫణుల కెవ్వడు పోసె – బరగ బాలు
మధుపాళి కెవ్వడు – మకరంద మొనరించె
బసుల మెవ్వ డొసంగె – బచ్చిపూరి
తే. జీవకోట్లను బోషింప – నీవెకాని
వేఱె యొక దాత లేడయ్య – వెదకిచూడ.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ శ్రీహరీ!అడవిలోని పక్షులకెవ్వడాధారమయ్యెనో,మృగజాతి కెవ్వడు మేతపెట్టెనో,అడవిలోని పశుపక్ష్యాదుల కెవ్వడాహారమిచ్చెనో,చెట్లకెవ్వడు నీళ్ళుపోసి పెంచెనో స్త్రీల గర్భములోని శిశువులనెవ్వరు పెంచిరో,పాములకెవ్వరు పాలుపోసి పెంచెనో,తుమ్మెద సమూహమున కెవ్వరు మకరందమిచ్చెనో,పశువులకు పచ్చగడ్డి పెట్టిపోషించే వాడెవ్వడో అట్టి జగద్రక్షకుడైన నరశింహమూర్తియే సర్వులకూ దాతగాని వేరొకడు కాదుగదయ్యా!
.
Poem:
See. Adavipakshula Kevva – Daahaara Michchenu
Mrugajaati Kevvadu – Metabette
Vanacharaadulaku Bho – Jana Mevva Dippimche
Jetla Kevvadu Neellu – Chedipose
Streelagarbhambuna – Sisuvu Nevvadu Pemche
Phanula Kevvadu Pose – Baraga Baalu
Madhupaali Kevvadu – Makaramda Monarimche
Basula Mevva Dosamge – Bachchipoori
Te. Jeevakotlanu Boshimpa – Neevekaani
Verxe Yoka Daata Ledayya – Vedakichooda.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. aDavipakShula kevva – Daahaara michchenu
mRugajaati kevvaDu – mEtabeTTe
vanacharaadulaku bhO – jana mevva DippiMche
jeTla kevvaDu neeLLu – chEdipOse
streelagarbhaMbuna – SiSuvu nevvaDu peMche
phaNula kevvaDu pOse – baraga baalu
madhupaaLi kevvaDu – makaraMda monariMche
basula mevva DosaMge – bachchipoori
tE. jeevakOTlanu bOShiMpa – neevekaani
vErxe yoka daata lEDayya – vedakichooDa.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.