పద్యం:
సీ. అమరేంద్రవినుత | నే – నతిదురాత్ముడ నంచు
గలలోన నైనను – గనుల బడవు
నీవు ప్రత్యక్షమై – నులువకుండిన మానె
దొడ్డగా నొక యుక్తి – దొరకెనయ్య |
గట్టికొయ్యను దెచ్చి – ఘనముగా ఖండించి
నీస్వరూపము చేసి – నిలుపుకొంచు
ధూప దీపము లిచ్చి – తులసితో బూజించి
నిత్యనైవేద్యముల్ – నేమముగను
తే. నడుపుచును నిన్ను గొలిచెద – నమ్మి బుద్ధి
నీ ప్రపంచంబు గలుగు నా – కింతె చాలు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఇంద్రునిచే స్తుతించబడినవాడా!నేను చాలా దుర్మార్గుడనని కలనైన కనిపించవు గదా!నీవు కనిపించక పోయిననూ సరే. నాకు మంచియుపాయము తోచినది. గట్టికొయ్య నొకదానిని తెచ్చి నీ విగ్రహం చేయించి ధూపధీపము లిచ్చి తులసితో పూజించి నిత్యనైవేద్యములు నియమముతో నర్పించి నిన్ను నమ్మి మనస్పూర్తిగా మనస్సులో నిలుపుకొందును. ఈ జన్మకీ బుద్దిచాలు తండ్రీ! వేరేమీ నాకక్కరలేదు.
.
Poem:
See. Amaremdravinuta | Ne – Natiduraatmuda Namchu
Galalona Nainanu – Ganula Badavu
Neevu Pratyakshamai – Nuluvakumdina Maane
Doddagaa Noka Yukti – Dorakenayya |
Gattikoyyanu Dechchi – Ghanamugaa Khamdimchi
Neesvaroopamu Chesi – Nilupukomchu
Dhoopa Deepamu Lichchi – Tulasito Boojimchi
Nityanaivedyamul – Nemamuganu
Te. Nadupuchunu Ninnu Golicheda – Nammi Buddhi
Nee Prapamchambu Galugu Naa – Kimte Chaalu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. amarEMdravinuta | nE – natiduraatmuDa naMchu
galalOna nainanu – ganula baDavu
neevu pratyakShamai – nuluvakuMDina maane
doDDagaa noka yukti – dorakenayya |
gaTTikoyyanu dechchi – ghanamugaa khaMDiMchi
neesvaroopamu chEsi – nilupukoMchu
dhoopa deepamu lichchi – tulasitO boojiMchi
nityanaivEdyamul – nEmamuganu
tE. naDupuchunu ninnu golicheda – nammi buddhi
nee prapaMchaMbu galugu naa – kiMte chaalu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.