పద్యం:
సీ. అతిశయంబుగ గల్ల – లాడనేర్చితిగాని
పాటిగా సత్యముల్ – పలుకనేర
సత్కార్య విఘ్నముల్ – సలుప నేర్చితిగాని
యిష్ట మొందగ నిర్వ – హింపనేర
నొకరి సొమ్ముకు దోసి – లొగ్గ నేర్చితిగాని
చెలువుగా ధర్మంబు – సేయనేర
ధనము లియ్యంగ వ – ద్దనగ నేర్చితిగాని
శీఘ్ర మిచ్చెడునట్లు – చెప్పనేర
తే. బంకజాతాక్ష | నే నతి – పాతకుడను
దప్పులన్నియు క్షమియింప – దండ్రి వీవె |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ నరశింహా!మూఢుడనై అతిగా అబద్దములాడ నేర్చితినిగాని సూటిగా నిజము బల్కనైతిని.మంచి పనులకు ఆటంకమైతినేగాని యిష్టముతో నిర్వహించనైతిని.యితరులకు సహాయపడవద్దని చెప్పుట నేర్చితినేగాని దానము నిమ్మని శీఘ్రముగా చెప్పనైతి.ఓ పంకజాక్ష!నేను అత్యంత పాపాత్ముడను.నా తప్పులు బాపి నన్ను రక్షించే తండ్రివి నీవేనయా!
.
Poem:
See. Atisayambuga Galla – Laadanerchitigaani
Paatigaa Satyamul – Palukanera
Satkaarya Vighnamul – Salupa Nerchitigaani
Yishta Momdaga Nirva – Himpanera
Nokari Sommuku Dosi – Logga Nerchitigaani
Cheluvugaa Dharmambu – Seyanera
Dhanamu Liyyamga Va – Ddanaga Nerchitigaani
Seeghra Michchedunatlu – Cheppanera
Te. Bamkajaataaksha | Ne Nati – Paatakudanu
Dappulanniyu Kshamiyimpa – Damdri Veeve |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. atiSayaMbuga galla – laaDanErchitigaani
paaTigaa satyamul – palukanEra
satkaarya vighnamul – salupa nErchitigaani
yiShTa moMdaga nirva – hiMpanEra
nokari sommuku dOsi – logga nErchitigaani
cheluvugaa dharmaMbu – sEyanEra
dhanamu liyyaMga va – ddanaga nErchitigaani
Seeghra michcheDunaTlu – cheppanEra
tE. baMkajaataakSha | nE nati – paatakuDanu
dappulanniyu kShamiyiMpa – daMDri veeve |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.