Main Menu

Athividhyanearchuta Annavastramulake (అతివిద్యనేర్చుట అన్నవస్త్రములకే)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. అతివిద్యనేర్చుట – అన్నవస్త్రములకే
పసుల నార్జించుట – పాలకొఱకె
సతిని బెండ్లాడుట – సంసార సుఖముకే
సుతుల బోషించుట – గతులకొఱకె
సైన్యముల్ గూర్చుట – శత్రుజయమునకే
సాము నేర్చుటలెల్ల – చావుకొఱకె
దానమిచ్చుటయు ముం – దటి సంచితమునకే
ఘనముగా జదువుట – కడుపు కొఱకె

తే. యితర కామంబు గోరక – సతతముగను
భక్తి నీయందు నిలుపుట – ముక్తి కొఱకె
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ శ్రీ ధర్మపుర నివాస నరసింహా!విద్య ఎక్కువ నేర్చుకొనుట విత్తమునకే అనగా అన్న వస్త్రములకే!పశువులను పెంచుట పాడి కొరకే! సంసార సుఖమునకే పెండ్లియాడుట,కొడుకులను పెంచుట పుణ్యలోకగతులకే,సైన్యము నేర్పరుచుకొనుట శతృ భీతికే,సాముగరిడీ విద్యలు నేర్చుట చావుకొరకే, దానము చేయుట పుణ్యమును మూటగట్టుటకొరకే, జ్ఞానమునెక్కువగా నార్జించుట ఉదరపోషణమునకే, ఏ యితర కోరికలు లేక నిత్యము నిన్ను స్మరించుట ముక్తి కొఱకే స్వామీ!
.


Poem:
See. Atividyanerchuta – Annavastramulake
Pasula Naarjimchuta – Paalakorxake
Satini Bemdlaaduta – Samsaara Sukhamuke
Sutula Boshimchuta – Gatulakorxake
Sainyamul Goorchuta – Satrujayamunake
Saamu Nerchutalella – Chaavukorxake
Daanamichchutayu Mum – Dati Samchitamunake
Ghanamugaa Jaduvuta – Kadupu Korxake

Te. Yitara Kaamambu Goraka – Satatamuganu
Bhakti Neeyamdu Niluputa – Mukti Korxake
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. atividyanErchuTa – annavastramulakE
pasula naarjiMchuTa – paalakorxake
satini beMDlaaDuTa – saMsaara sukhamukE
sutula bOShiMchuTa – gatulakorxake
sainyamul goorchuTa – SatrujayamunakE
saamu nErchuTalella – chaavukorxake
daanamichchuTayu muM – daTi saMchitamunakE
ghanamugaa jaduvuTa – kaDupu korxake

tE. yitara kaamaMbu gOraka – satatamuganu
bhakti neeyaMdu nilupuTa – mukti korxake
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.