Main Menu

Avanilogala Yaathralanni Cheyagavacchu (అవనిలోగల యాత్రలన్ని చేయగవచ్చు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. అవనిలోగల యాత్ర – లన్ని చేయగవచ్చు
ముఖ్యుడై నదులందు – మునుగవచ్చు
ముక్కుపట్టుక సంధ్య – మొనసి వార్వగవచ్చు
దిన్నగా జపమాల – ద్రిప్పవచ్చు
వేదాల కర్థంబు – విఱిచి చెప్పగవచ్చు
శ్రేష్ఠ్ క్రతువు లెల్ల – జేయవచ్చు
ధనము లక్షలు కోట్లు – దానమియ్యగవచ్చు
నైష్ఠికాచారముల్ – నడుపవచ్చు

తే. జిత్త మన్యస్థలంబున – జేరకుండ
నీ పదాంభోజములయందు – నిలపరాదు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహస్వామీ!భూమియందలి తీర్థయాత్రలన్నియు చేయ వచ్చును.ముఖ్యనదులలో మునగవచ్చు, ముక్కు మూసుకొని, సంధ్యావందనం చేయవచ్చు. జపమాలతో జపించవచ్చు. వేదాల కర్థము విడమర్చి చెప్పవచ్చు. గొప్పవైన యజ్ఞములను చేయవచ్చు.విరివిరిగా దానములు చేయవచ్చు.నియమనిష్ఠలతో ఆచారవ్యవహారములు నాచరించవచ్చు. కాని ఓ దేవదేవా! ఏకాగ్రతతో నీ పాదపద్మములను కొలుచుట సాధ్యము కాకున్నది తండ్రీ!
.


Poem:
See. Avanilogala Yaatra – Lanni Cheyagavachchu
Mukhyudai Nadulamdu – Munugavachchu
Mukkupattuka Samdhya – Monasi Vaarvagavachchu
Dinnagaa Japamaala – Drippavachchu
Vedaala Karthambu – Virxichi Cheppagavachchu
Sreshth Kratuvu Lella – Jeyavachchu
Dhanamu Lakshalu Kotlu – Daanamiyyagavachchu
Naishthikaachaaramul – Nadupavachchu

Te. Jitta Manyasthalambuna – Jerakumda
Nee Padaambhojamulayamdu – Nilaparaadu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. avanilOgala yaatra – lanni chEyagavachchu
mukhyuDai nadulaMdu – munugavachchu
mukkupaTTuka saMdhya – monasi vaarvagavachchu
dinnagaa japamaala – drippavachchu
vEdaala karthaMbu – virxichi cheppagavachchu
SrEShTh kratuvu lella – jEyavachchu
dhanamu lakShalu kOTlu – daanamiyyagavachchu
naiShThikaachaaramul – naDupavachchu

tE. jitta manyasthalaMbuna – jErakuMDa
nee padaaMbhOjamulayaMdu – nilaparaadu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.