Main Menu

Bomma Laantharu (బొమ్మలాంతరు)

Sri Sri (శ్రీరంగం శ్రీనివాస రావు) popularly known as Sri Sri, was born on 2nd January 1910 in Visakhapatnam. Sri Sri completed his education in the same school in which his father Sri Venkata Ramaiah was working as a mathematics teacher. He married Ms. Venkata Ramanamma at an age of 15 and adapted a girl child. Later on he married Ms. Sarojini and was blessed with a son and two daughters.More...

Book Of Reference : Khadga Srushti

Book Published Year : 1966

Title of the Poem: Bomma Laantharu

Language: Telugu (తెలుగు)

 


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This lyric was originally composed in Telugu. Other languages are for your convenience



దిద్దుతూన్న గుంట ఓనమాలు చెరిపేసి
చేతిలో ఉన్న బలపం విరిచేసి
కొత్త పలక కొనుక్కొచ్చాడు కుర్రాడు

పాగా చుట్టుకొంటూన్న రోకలి పారేసి
తెలివితక్కువ తనాన్ని గొయ్యి చేసి పాతేసి
పొరుగువాడెలా ఉన్నాడని భోగట్టాచేశాడు వెర్రాడు

ఆడుతూన్న నాటకం ఆపేసి
పెట్టుకున్న గడ్డం కుళ్ళాయీ లాగేసి
ఆడియన్సులో కలసిపోయాడు విదూషకుడు

నిన్నటి వగ్దానాన్ని నేటి ఉపన్యాసంలో కాల్చేసి
నేటి ఫోర్జరీని రేపటి సంతకంగా మార్చేసి
ఇక్కడే వుండు వొస్తానని ఎక్కడికో పోయాడు వినాయకుడు

తన చుట్టూ తాను తిరుగుతూ
సూర్యుడి చుట్టూ పరిభ్రమించే భూమిలాగ
ఆశయంచుట్టూ తిరుగుతోంది ఆవేశం.

(చీట్లాటలో ఒక చేతిని అన్నీ పొడిముక్కలే అయి ఒక బొమ్మ లేకపోవడం బొమ్మలాంతరు.
అప్పుడు ఆట కలిపి మళ్ళీ ముక్కలు కలపడం ధర్మం).


Awaiting Contribution.


Awaiting Contribution.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.