Main Menu

Archive | Biographies

Gollapudi columns ~ Kasi mamayyalu! (కాశీ మామయ్యలు!)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

ఇటీవల ఒక దినపత్రికలో ఒక ప్రకటనని చూశాను -‘కనబడుటలేదు’ అంటూ. ఏలూరు వోటర్లు నగరంలో గోడల మీద ఈ ప్రకటనని అంటించారట. ”మా ఏలూరు లోక్‌సభ ప్రతినిధిగా మేము ఎన్నుకున్న ఎం.పి., కేంద్ర మంత్రి… గత కొన్ని రోజులుగా కనిపించుటలేదు. వారి ఆచూకీ తెలిపిన -వారికి తగిన బుద్ధి చెప్పబడును” -ఇదీ ప్రకటన. చక్కని హాస్యం, ఎక్కువ కడుపుమంట ఉన్న మహానుభావులు ఇలా వీధిన పడ్డారు. ఎలాగూ -ఈ నాయకుల పుణ్యమా అని తమకు దరిద్రం తప్పలేదు […]

Continue Reading · 0

Gollapudi columns ~ Matruvandanam(మాతృవందనం)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

ప్రపంచంలో అన్ని దేశాల జాతీయ గీతాలలోనూ భారత దేశపు జాతీయ గీతం గొప్పగా ఉన్నదని ఐక్యరాజ్య సమితి సంస్థ (యునెస్కో) ప్రకటించింది. ఇది గర్వకారణం. క్రికెట్ ధర్మమా అని దాదాపు సంవత్సరం పొడుగునా అన్ని దేశాల జాతీయ గీతాలను వినే అవకాశం మనందరికీ కలిసొచ్చింది. తప్పనిసరిగా యునెస్కోకి అనిపించిన ఆలోచన మనకి వస్తూనే ఉంటుంది. ‘జనగణమన’ నిస్సందేహంగా గొప్ప గీతం. గొప్ప బాణీ. గీతంలో గాంభీర్యం, బాణీలో ఉద్ధతి ఉంది. అయితే మన మాతృవందనం ‘వందేమాతరం’ కానీ, […]

Continue Reading · 0

Gollapudi columns ~ Margadarsi-Manipus(మార్గదర్శి-మణిపూస)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

సరిగ్గా 19 సంవత్సరాల కిం దట దత్తా సోదరులు-అంటే పెద్దాయన శివ శక్తిదత్తా, విజ యేంద్ర ప్రసాద్ దర్శకత్వం వ హించిన చిత్రం ‘అర్థాంగి’లో మంచి పాత్రలో నటించాను. ఆ చిత్రానికి కో డెరైక్టర్ రాజ మౌళి. వారిద్దరి మధ్య ఆయన కాశీవిశ్వేశ్వరరావు నాకు చాలా ఆత్మీయ మిత్రులు. చివరి రోజుల్లో ఒక రోజంతా మా ఇంట్లో ఉండినా ‘సాయంకాలమైంది’ నవల చదివారు. శివశక్తిదత్తా గొప్ప కవి. విజయేంద్ర ప్రసాద్ మంచి కథా రచయిత. ఇది నేపథ్యం. […]

Continue Reading · 0

Gollapudi columns ~ Ennika(la)lu! (ఎన్నిక(ల)లు!)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

నేను తేలికగా 51 సంవత్సరాలుగా సినీరంగంలో ఉన్నాను. రచనలు చేశాను. నటించాను. గొప్ప గొప్ప సినీమాలను చూశాను. కళ్లముందు పంచ రంగుల కలల్ని ఆవిష్కరించే అతి ఆకర్షణీయమైన మాధ్యమం సినీమా అని మొన్న మొన్నటిదాకా నమ్మాను. కాని ఆ నమ్మకం ఇప్పుడిప్పుడే సడలిపోయింది. సినీమా కంటే -కళ్ల ముందు వెయ్యి రంగుల కలల్ని ఆవిష్కరించగలిగిన శక్తీ, సామర్థ్యం వున్నది రాజకీయరంగమని, ఏ నటుడూ రాజకీయ నాయకునికి సాటిరాడని ఇప్పుడిప్పుడే రుజువవుతోంది. సినీమా ‘కళ’గా కాక వ్యాపారంగా మారిపోయి […]

Continue Reading · 0

Gollapudi columns ~ Maggi Yagi(మాగీ యాగీ)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

వ్యాపారానికి విశ్వాసం పెట్టుబడి. మనకు తెలియని సమాచారాన్ని, మనకు తెలిసిన, మనం అభిమానించిన వ్యక్తి తెలియచేయడమే ప్రక టన. బజారులో అమ్మే మిఠాయి తినవద్దంది అమ్మ. అటు వేపు కూడా చూడం. బజారులో ఉన్న ఫలానా పకోడీ బాగుంటుందన్నాడు పక్కింటాయన. ‘ఆయనెవరయ్యా చెప్పడానికి?’ అంటాం. ఇంకా, పక్కింటాయన మీద కోపం ఉంటే పకోడీ తిని మరీ ఆయన మాట తప్పని నిరూపిస్తాం. ప్రకటనకు పెట్టుబడి ఆ పెద్దమనిషి పరపతి. ‘పెద్దమనిషి’ అంటున్నాను కాని, ‘సినీ నటుడు’ అనడం […]

Continue Reading · 0

Gollapudi columns ~ Devudu ksaminncugaka! (దేవుడు క్షమించుగాక!)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

గత సోమవారం శ్రీలంక నెదర్లాండ్‌ల ఆట ముగించే సమయానికి ముందుగానే టీ20 క్రికెట్‌ ఆటలో ఓడించింది. ఇంకేం చెయ్యాలో తెలీక నాకు చాలా యిష్టమైన ఛానల్‌ ‘టైమ్స్‌ నౌ’కి వెళ్లాను. అప్పుడే శ్రీరామ సేన నాయకులు ప్రమోద్‌ ముతాలిక్‌ గారి వీరంగాన్ని చూసే అదృష్టం కలిగింది. అయ్యో! కాస్తముందుగానే ఈ అదృష్టాన్ని పుంజుకోలేకపోయానే అని బాధపడుతూ ఈ వినోద ప్రదర్శనని తిలకించాను. చాలామందికి ప్రమోద్‌ ముతాలిక్‌ ఎవరో తెలీకపోవచ్చు. కర్ణాటకలో భారతీయ సంప్రదాయ వైభవాన్ని కాపాడడానికి కంకణం […]

Continue Reading · 0

Gollapudi columns ~ Kotha Vedam(కొత్త వేదం)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

ఆయుష్, ప్రార్థన ఇప్పుడు జహీర్ ఆలనలో ఉన్నారు. ‘‘వాళ్ల మతానికి నేను అడ్డురాను. వాళ్లు హిందువులుగానే పెరుగుతారు. దేవాలయానికి వెళతారు’’ అన్నారు జహీర్. చాలా సంవత్సరాల కిందట భారతీరాజా దర్శకత్వంలో ‘జమదగ్ని’ అనే చిత్రంలో నటించాను. ఆ సందర్భంలో ఆయన తీసిన ఒక సినీమాని నాకు ప్రత్యేకంగా ప్రదర్శనని ఏర్పాటు చేశారు. చిత్రం పేరు ‘వేదం పుదిదు’ (వేదం కొత్తది). స్థూలంగా కథ ఇది. ఊరి పెద్ద తక్కువ కులస్తుడు. అతని కారణంగా ఓ బ్రాహ్మణుడు ప్రాణాన్ని […]

Continue Reading · 0

Gollapudi columns ~ Charitra Tappatadugulu (చరిత్ర తప్పటడుగులు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

మానవ జీవన గమనాన్ని నిర్దేశించడంలో చరిత్ర తిరుగులేని నియంత. తనదైన బాణీ, ధోరణీ, సరళీ, స్వారస్యం ఉన్న గమనం చరిత్రది. చరిత్ర అర్థంకాని విదేశీ లిపి -అన్నాడో -కవి. ఎప్పుడో కాలం గడిచాక -వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు -వేడుకగా ఎకసెక్కం చేసే వింత వినోదం చరిత్రది. గత శతాబ్దాన్ని -దుర్మార్గమయిన కారణానికి చిరస్మరణీయం చేసిన నియంత హిట్లర్. అతని చావుని ఎన్నో లక్షలమంది కోరుకున్నారు. ఎదురుచూశారు. ఎన్నో వందల మంది ఆయన్ని చంపడానికి కుట్రలు పన్నారు. ప్రయత్నాలు […]

Continue Reading · 0

Gollapudi columns ~ Ikaa Rahulki Selavu(ఇక రాహుల్‌కి సెలవు)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

కనీసం ఆరేళ్ల సెలవుని వారి అమ్మ మంజూరు చేయాలని, వారు ఈ ఉద్యోగం నుంచి వీఆర్‌ఎస్ తీసుకుని- మంచి ప్రణాళికలని ఇటలీలో రూపుదిద్ది మళ్లీ ఇండియా వచ్చి ఉద్యోగంలో చేరాలని మనవి చేస్తున్నాను. ఈ మధ్య ఢిల్లీలోను, అంత కు ముందు ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాలలో సోదికి లేకుండా పో యిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఎట్టకే లకు ఒక గొప్ప నిర్ణ యాన్ని తీసుకున్నా రు. అసలు పార్టీకి ఈ […]

Continue Reading · 0

Gollapudi columns ~ Annjanammakunivali (అంజనమ్మకునివాలి)

Gollapudi Maruthi Rao (గొల్లపూడి మారుతీరావు)

నా జీవితంలో మొదటిసారిగా – నా ఎనిమిదో ఏట – విశాఖపట్నం మినర్వా టాకీసులో అంజనమ్మని చూశాను. ఆ సినీమా ‘బాలరాజు ‘. అందులో ప్రముఖంగా ముగ్గురు నటీనటులు – అక్కినేని, ఎస్.వరలక్ష్మి, అంజలీదేవి. నా అదృష్టం ఏమిటంటే – నా జీవితంలో ఆ ముగ్గురితోనూ నటించే అవకాశం కలిసి వచ్చింది. మరో 14 సంవత్సరాలకు అక్కినేని కంపెనీ అన్నపూర్ణా సంస్థ ద్వారా సినీరంగ ప్రవేశం చేసి వారికి సంభాషణలు రాశాను. తర్వాతి కాలంలో వారితో ఎన్నో […]

Continue Reading · 0