Main Menu

Chittasuddhiga Neeku Sevajesedhagaani (చిత్తశుద్ధిగ నీకు సేవజేసెదగాని)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. చిత్తశుద్ధిగ నీకు – సేవజేసెదగాని
పుడమిలో జనుల మె – ప్పులకు గాదు
జన్మపావనతకై – స్మరణజేసెద గాని
సరివారిలో బ్రతి – ష్థలకు గాదు
ముక్తికోసము నేను – మ్రొక్కి వేడెదగాని
దండిభాగ్యము నిమి – త్తంబు గాదు
నిన్ను బొగడగ విద్య – నేర్చితినేకాని
కుక్షినిండెడు కూటి – కొఱకు గాదు

తే. పారమార్థికమునకు నే బాటుపడితి
గీర్తికి నపేక్షపడలేదు – కృష్ణవర్ణ |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ దుష్టసంహారా!నరశింహా!మనఃస్పూర్తిగా నిన్నే సేవింతును గాని దుష్టజనుల మొప్పునకు కాదు.నాజన్మ సాఫల్యతకై నిన్నే స్మరింతును గాని నా సాటివారిలో అనవసర గొప్పతనమునకు గాదు.ముక్తికోసమే నిన్ను మ్రొక్కి వేడుకొంటున్నాను గాని అనిత్యమైన భోగభాగ్యాదుల కొఱకు గాదు.నిన్ను ప్రస్తుతించుటకే విద్యనేర్చితినిగాని నశ్వరమైన శరీరము కొఱకుగాదు .ముక్తి కొఱకు నే పాటుపడుతున్నాను గాని కీర్తి కొఱకుగాదు.ఓ నీలమేఘశ్యామా! కీర్తిని కోరుటలేదు. ముక్తిని మాత్రమే ప్రసాదించమని వేడుకొంటున్నాను.
.


Poem:
See. Chittasuddhiga Neeku – Sevajesedagaani
Pudamilo Janula Me – Ppulaku Gaadu
Janmapaavanatakai – Smaranajeseda Gaani
Sarivaarilo Brati – Shthalaku Gaadu
Muktikosamu Nenu – Mrokki Vededagaani
Damdibhaagyamu Nimi – Ttambu Gaadu
Ninnu Bogadaga Vidya – Nerchitinekaani
Kukshinimdedu Kooti – Korxaku Gaadu

Te. Paaramaarthikamunaku Ne Baatupaditi
Geertiki Napekshapadaledu – Krushnavarna |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. chittaSuddhiga neeku – sEvajEsedagaani
puDamilO janula me – ppulaku gaadu
janmapaavanatakai – smaraNajEseda gaani
sarivaarilO brati – Shthalaku gaadu
muktikOsamu nEnu – mrokki vEDedagaani
daMDibhaagyamu nimi – ttaMbu gaadu
ninnu bogaDaga vidya – nErchitinEkaani
kukShiniMDeDu kooTi – korxaku gaadu

tE. paaramaarthikamunaku nE baaTupaDiti
geertiki napEkShapaDalEdu – kRuShNavarNa |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.