Main Menu

E Ee Ai O Oo Ou (ఎ ఏ ఐ ఒ ఓ ఔ)

Sri Sri (శ్రీరంగం శ్రీనివాస రావు) popularly known as Sri Sri, was born on 2nd January 1910 in Visakhapatnam. Sri Sri completed his education in the same school in which his father Sri Venkata Ramaiah was working as a mathematics teacher. He married Ms. Venkata Ramanamma at an age of 15 and adapted a girl child. Later on he married Ms. Sarojini and was blessed with a son and two daughters.More...

Book Of Reference : Khadga Srushti

Book Published Year : 1966

Title of the Poem: E Ee Ai O Oo Ou

Language: Telugu (తెలుగు)

 


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This lyric was originally composed in Telugu. Other languages are for your convenience




ఎక్కడ ఎప్పుడు
ఎవరైనా చెప్పుడు ఈ చిక్కు విప్పుడు
ఆరంభం ఎక్కడ
అంతం ఎప్పుడు
ఎందుకీ నొప్పులు ఏమిటీ చప్పుడు
లక్షలు లక్షలు
యక్షప్రశ్నలు అన్నీ తప్పులు
ఏచోట జననం
ఏ పూట మరణం
ఈలోపున ఎన్నెన్ని పడరాని తిప్పులు
కంట్లో కారం
ఒంట్లో భారం గుండెల్లో దాహం
ఉచ్ఛాసం నిశాసం
ఒకే అనుప్రాసం
సందేహం పన్నుతుంది సరోరుహ వ్యూహం
ఆగమనం నిష్క్రమణం
అంతా ఒక చంక్రమణం ఆలోచించు బాగా
ఏదైతే సవాలు
అదేలే జవాబు
ఒమీగా ఆల్ఫా, ఆల్ఫా ఒమీగా
శాస్త్రం నీ అస్త్రం
మౌనం శ్మసానం అదికాదు జ్ఞానం
పరీక్షించు సహేతుకంగా
ప్రసంగించు సాధికారంగా
సమిష్ఠి సూత్రం మాత్రం సరైన విధానం
ఏమిటీ చప్పుడో
ఎందుకీ నొప్పులో అంతం ఎక్కడో
ఆనందం ఎప్పుడో
ఆ చిక్కు విప్పుడు
ఎక్కడా ఎప్పుడూ ఎవడూ చెప్పడు

ఏదైనా గీతం
చేదైనా మైమరపిం
చేదైనా మది కదిలిం
చేదైనా ఎద రగిలిం
చేదైనా ఏదైనా
నేడైనా
రేపైనా
ఏమైనా గానం
జడి జడిగా వర్షం నా
మెడమీదా
తొడమీదా
తడితడిగా రక్తం నా
గదిలోనూ
హృదిలోనూ
దడదడగా కంపం నా
నడినెత్తిని రంపం
నాకోసం ఆకాశం
చేకూర్చే ఆవేశం
రేగించే ఉద్రేకం
ఊగించే ఉదేగం
దావానల హాలహల
కీలోజ్జల కోటీరం
నీలోత్పల కాసారం
నీ లోపల కేయూరం
కనిపించక జడిపించే
కికురించే సకిలించే
కిటికీలో రూపం వా
కిటి ముంగిటి ధూపం
గాలంవలె శూలవలె
వేలాడే కాలం
వేటాడే వ్యాఘ్రం అది
వెంటాడును శీఘ్రం
కాలానికి భయపడితే
కలిగేదే శోకం
కదిలేనా లోకం
దిరికేనా నాకం
కనుపాపలు తెరచాపలు
ప్రళయంలో పయనం
నిరయంలో శయనం
విలయంలో విజయం

ఐక్యం అదీ మనకి ముఖ్యం
అందులోనే ఉంది సౌఖ్యం
లేనిపోని చీలికలు
రెండు రెండు నాలికలు
ఛీ యిదా బతుక్కి
ఫాయిదా
ఐక్యం అదీ వ్యవస్థ
అప్పుడుండదు మనకీ అవస్థ
కాదు ఔను అవును
కాదు కాదు అవదు
అనేకం అయితే ఏకం
అదే వివేకం
ఐక్యం అన్నింటికీ మూలం
అటే కదుల్తోంది కాలం
పురోగతి ప్రపంచనీతి
మనదొకే మానవజాతి
వ్యక్తికి బహువచనం
శక్తి
ఐక్యం అదే మనకి గమ్యం
అప్పుడే సిద్ధిస్తుంది సామ్యం
వ్యర్ధం వద్దంటా
యుద్ధం వద్దంటా
కామ్యం ఐక్యం అయిన బతుకే
రమ్యం
ఐక్యం ఎప్పుడో కాదిప్పుడే
ఎక్కడో కాదు అదిక్కడే
మాట చేతగామారి
మనిషి మనిషితో చేరి
సప్నం సత్యం ఐతేనే
సర్గం

ఒకనొక అనగా అనగాల వేళ
(అది కృతయుగం కాదు మృతయుగం)
అదే మన కథలకీ కవితాలకీ డోల
మనుష్యుని బాల్యంలోని అమాయకతం
(ప్రార్ధించే మొక్కలూ
మాట్లాడే నక్కలూ)
కళలో జీవితంలో నిదర్శించే అరణ్య తతం
సామూహికం సాతంత్ర్యం అనేషించు అగత్యం
(ఒంటరి తనం
తుంటరి తనం)
సామాజికంగా పెరుగుతోంది సేచ్ఛ ఇది సత్యం
అజ్ఞానం చీకటి భయానికీ క్రౌర్యానికీ కాణాచి
(శిశుతం అదే
పశుతం అదే)
చంపటానికి సరదా అమ్మయ్యో బూచి
మార్చాలంటా ఇదంతా ప్రసరించాలి కాంతి
(శాస్త్రం కళని చంపబోదు జనాన్ని భయంతో నింపలేదు)
మానవాళికి పరిణామం కానుక పావురంలాంటి శాంతి

ఓహో విహంగమా
ఎగురు
ఎగురు
నీ రెక్కల విసరులో మనంతరాలు
తరలు
తరలు ఓహో
తరంగమా
కదలు
కదలు
నీ ముంచెత్తు వరదలో నిమ్నోన్నతాలు
కరగు
కరగు
ఓహో మృదంగమా
పలుకు
పలుకు
నీవిచ్చు హెచ్చరికలో నిరాశా దురాశా భాండాలు
పగులు
పగులు
ఓహో జనాంగమా
నడువు
నడువు
నీ పరాంకోటి హస్తాలతో నూతన గవాక్షాలు
తెరువు
తెరువు

ఔను వాహనం మారింది ; దూరానికి పూరపు టర్ధం పోయింది
పూరం దూరం పోయింది వెనకటి వాహనం మారింది
ఆ సూర్యుడే నేడూ
ఆ చంద్రుడే నాడూ
అవే నక్షత్రాలూ – ఐనా కాలం మారింది
ఔనా కాలం మారింది మరి : మానవుడా మేలుకో నేస్తం
ఎద్దుబండితో కొలవకు దూరాన్ని ఎగరవోయ్ చదలయెద చీలుస్తూ
రేపు బయల్దేరా లనుకున్నావు
నేడే ఇచ్చటికి వచ్చేశావు
విచ్చేసింది నీ తరుణం పుచ్చుకో ఇది నీ భావి
ఇది నీ భావి గ్రహించు : ఈ భావి నీకు నా ప్రెజెంటు
భూతకాలపు సరీసృపాలని పాతరాతి యుగంలో పారేయ్
పాతెయ్ నీ సందేహాలని
తోలెయ్ నీ మందాక్షాలని
నిటారుగా నిలబడు నేస్తం హుటాహుటిగా ముందుకిసాగు
హుషారుగా ముందుకిసాగు : ఊరిఖే వెనక్కి చూస్తావేం
దుప్పివీ కుక్కవీ కావు తిర్యగ్దృక్కువి నువుకావు
దూరం కరిగిపోతోంది
కాలం మరిగిపోతోంది
మానవుడిగా మేలుకో నేస్తం ఏలుకో ఈ వశం సమస్తం.

Awaiting Contribution.


Awaiting Contribution.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.