Main Menu

Ebhakumbhamulameedhakerigedi Singambu (ఇభకుంభములమీదికెగిరెడి సింగంబు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. ఇభకుంభములమీది – కెగిరెడి సింగంబు
ముట్టునే కుఱుచైన – మూషకమును?
నవచూతపత్రముల్ – నమలుచున్న పికంబు
గొఱుకునే జిల్లేడు – కొనలు నోట?
అరవిందమకరంద – మనుభవించెడి తేటి
పోవునే పల్లేరు – పూలకడకు?
లలిత మైన రసాల – ఫలము గోరెడి చిల్క
మెసవునే భమత ను – మ్మెత్తకాయ?

తే. నిలను నీకీర్తనలు పాడ – నేర్చినతడు
పరులకీర్తన బాడునే – యరసి చూడ?
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ పద్మనాభ!నరశింహా!ఏనుగుకుంభస్థలమున కెగురు సింగము అల్పమైన చిట్టెలుకను ముట్టునా?లేమామిడి చిగురుటాకుల నారగించు కోయిల,జిల్లేడు కొనలను కొఱుకునా!పద్మమకరందమును గ్రోలు తుమ్మెద పల్లేరు పూవుల నాశ్రయించునా!సుకుమార మామిడిపండ్ల రసమును గ్రోలే చిలుక ఉమ్మెత్తకాయను ఇష్టముతో దినునా?ఈ పుడమిపై నీ కీర్తనలనిష్టముగా పాడు గాయకుడు ఇతర పాటలు పాడునా?(పాడడనియర్థము)
.


Poem:
See. Ibhakumbhamulameedi – Kegiredi Simgambu
Muttune Kurxuchaina – Mooshakamunu?
Navachootapatramul – Namaluchunna Pikambu
Gorxukune Jilledu – Konalu Nota?
Aravimdamakaramda – Manubhavimchedi Teti
Povune Palleru – Poolakadaku?
Lalita Maina Rasaala – Phalamu Goredi Chilka
Mesavune Bhamata Nu – Mmettakaaya?

Te. Nilanu Neekeertanalu Paada – Nerchinatadu
Parulakeertana Baadune – Yarasi Chooda?
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. ibhakuMbhamulameedi – kegireDi siMgaMbu
muTTunE kurxuchaina – mooShakamunu?
navachootapatramul – namaluchunna pikaMbu
gorxukunE jillEDu – konalu nOTa?
araviMdamakaraMda – manubhaviMcheDi tETi
pOvunE pallEru – poolakaDaku?
lalita maina rasaala – phalamu gOreDi chilka
mesavunE bhamata nu – mmettakaaya?

tE. nilanu neekeertanalu paaDa – nErchinataDu
parulakeertana baaDunE – yarasi chooDa?
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.