పద్యం:
సీ. ఇభరాజవరద | ని – న్నెంత బిల్చినగాని
మాఱు పల్క వదేమి – మౌనితనమొ?
మునిజనార్చిత | నిన్ను – మ్రొక్కి వేడినగాని
కనుల జూడ వదేమి – గడుసుదనమొ?
చాల దైన్యమునొంది – చాటు చొచ్చినగాని
భాగ్య మియ్య వదేమి – ప్రౌఢతనమొ?
స్థిరముగా నీపాద – సేవ జేసెద నన్న
దొరకజాల వదేమి – ధూర్తతనమొ?
తే. మోక్షదాయక | యిటువంటి – మూర్ఖజనుని
కష్టపెట్టిన నీకేమి – కడుపునిండు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ గజేంద్రవరదా!నరశింహా!నిన్నెంత వేడుకొన్నా బలుకవేమయ్యా!ఘనమైనవ్రతమేమన్నా పట్టినావా?ఓ మునిగణార్చిత!నిన్ను పూజించి ప్రార్థించిననూ కన్నులకు కనపడవేమయ్యా!చాలా దీనత్వముతో నీ చెంతజేరిననూ నన్ను కరుణించి భాగ్యమీయవదేమివింతయో?ఓ మోక్షదాయక?నావంటి మూర్ఖులను భాదించుటవలన నీకేమి ఒరుగును తండ్రీ!.
.
Poem:
See. Ibharaajavarada | Ni – Nnemta Bilchinagaani
Maarxu Palka Vademi – Maunitanamo?
Munijanaarchita | Ninnu – Mrokki Vedinagaani
Kanula Jooda Vademi – Gadusudanamo?
Chaala Dainyamunomdi – Chaatu Chochchinagaani
Bhaagya Miyya Vademi – Praudhatanamo?
Sthiramugaa Neepaada – Seva Jeseda Nanna
Dorakajaala Vademi – Dhoortatanamo?
Te. Mokshadaayaka | Yituvamti – Moorkhajanuni
Kashtapettina Neekemi – Kadupunimdu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. ibharaajavarada | ni – nneMta bilchinagaani
maarxu palka vadEmi – maunitanamo?
munijanaarchita | ninnu – mrokki vEDinagaani
kanula jooDa vadEmi – gaDusudanamo?
chaala dainyamunoMdi – chaaTu chochchinagaani
bhaagya miyya vadEmi – prauDhatanamo?
sthiramugaa neepaada – sEva jEseda nanna
dorakajaala vadEmi – dhoortatanamo?
tE. mOkShadaayaka | yiTuvaMTi – moorkhajanuni
kaShTapeTTina neekEmi – kaDupuniMDu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.