Main Menu

Ehalokasoukhyamulicchagicheda Manna (ఇహలోకసౌఖ్యములిచ్చగించెద మన్న)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. ఇహలోకసౌఖ్యము – లిచ్చగించెద మన్న
దేహ మెప్పటికి దా – స్థిరత నొంద
దాయుష్య మున్న ప – ర్యంతంబు పటుతయు
నొక్కతీరున నుండ – దుర్విలోన
బాల్యయువత్వదు – ర్బలవార్ధకము లను
మూటిలో మునిగెడి – ముఱికికొంప
భ్రాంతితో దీని గా – పాడుద మనుమొన్న
గాలమృత్యువుచేత – గోలుపోవు

తే. నమ్మరా దయ్య | యిది మాయ – నాటకంబు
జన్మ మిక నొల్ల న న్నేలు – జలజనాభ |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహస్వామి! ఇహలోకము అనగా భూలోకసుఖములు కోరుదామంటే ఈ శరీరమునశ్వరమైనది. శాశ్వతమైంది కాదు. జీవితాంతము బలము ఒకే విధంగా ఉండదు. ఈ దేహమనే కట్టె చిన్నతనము, ప్రాయము, ముసలితనమనే ముఱికి గుంటలో మునిగిపోయే తోలుతిత్తి, దీనిని ప్రేమతో నిలుపుకొందామంటే చావు, మృత్యువులలో నిదిజారిపోతుంది. దీని నిన్నెటికిని నమ్మరాదు. ఇది యొక బూటకనాటకమువంటిది. పుట్టుకనేది నా కొద్దు తండ్రీ! ఓ పంకజనాభా! నన్ను రక్షింపుము.
.


Poem:
See. Ihalokasaukhyamu – Lichchagimcheda Manna
Deha Meppatiki Daa – Sthirata Nomda
Daayushya Munna Pa – Ryamtambu Patutayu
Nokkateeruna Numda – Durvilona
Baalyayuvatvadu – Rbalavaardhakamu Lanu
Mootilo Munigedi – Murxikikompa
Bhraamtito Deeni Gaa – Paaduda Manumonna
Gaalamrutyuvucheta – Golupovu

Te. Nammaraa Dayya | Yidi Maaya – Naatakambu
Janma Mika Nolla Na Nnelu – Jalajanaabha |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. ihalOkasaukhyamu – lichchagiMcheda manna
dEha meppaTiki daa – sthirata noMda
daayuShya munna pa – ryaMtaMbu paTutayu
nokkateeruna nuMDa – durvilOna
baalyayuvatvadu – rbalavaardhakamu lanu
mooTilO munigeDi – murxikikoMpa
bhraaMtitO deeni gaa – paaDuda manumonna
gaalamRutyuvuchEta – gOlupOvu

tE. nammaraa dayya | yidi maaya – naaTakaMbu
janma mika nolla na nnElu – jalajanaabha |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.