Main Menu

Jeemuthavarna Nee Moomutho Sariraaka (జీమూతవర్ణ నీ మోముతో సరిరాక)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. జీమూతవర్ణ | నీ – మోముతో సరిరాక
కమలారి యతికళం – కమును బడసె
సొగసైన నీ నేత్ర – యుగముతో సరిరాక
నళినబృందము నీళ్ల – నడుమ జేరె
గరిరాజవరద | నీ – గళముతో సరిరాక
పెద్దశంఖము బొబ్బ – పెట్ట బొడగె
శ్రీపతి | నీదివ్య – రూపుతో సరి రాక
పుష్పబాణుడు నీకు – బుత్రు డయ్యె

తే. నిందిరాదేవి నిన్ను మో – హించి విడక
నీకు బట్టమహిషి యయ్యె – నిశ్చయముగ.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ శ్రీహరీ! నరసింహమూర్తీ! జీమూతవర్ణా! (మేఘశరీరా!) నీ ముఖారవిందముతో సరితూగక చంద్రుడు మిక్కిలి లోపభూయిష్టుడయ్యెను. (చంద్రునిలో నల్లని మచ్చయున్నందువలన) అందమైన నీ కన్నులతో పోటీపడలేక పద్మములన్నియు నీట జేరినవి.గజేంద్రునికి వరములిచ్చి రక్షించినవాడా!నీ కంఠధ్వనితో సరితూగలేక పెద్దదైన శంఖము పెడబొబ్బలు పెట్టసాగెను.ఓ శ్రీపతీ!నీ దివ్యమంగళ సుందరస్వరుపముతో సరితూగక మన్మథుడు నీకు పుత్రుడయ్యెను.లక్ష్మీదేవి ప్రేమతో పట్టపురాణి అయ్యింది.
.


Poem:
See. Jeemootavarna | Nee – Momuto Sariraaka
Kamalaari Yatikalam – Kamunu Badase
Sogasaina Nee Netra – Yugamuto Sariraaka
Nalinabrumdamu Neella – Naduma Jere
Gariraajavarada | Nee – Galamuto Sariraaka
Peddasamkhamu Bobba – Petta Bodage
Sreepati | Needivya – Rooputo Sari Raaka
Pushpabaanudu Neeku – Butru Dayye

Te. Nimdiraadevi Ninnu Mo – Himchi Vidaka
Neeku Battamahishi Yayye – Nischayamuga.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. jeemootavarNa | nee – mOmutO sariraaka
kamalaari yatikaLaM – kamunu baDase
sogasaina nee nEtra – yugamutO sariraaka
naLinabRuMdamu neeLla – naDuma jEre
gariraajavarada | nee – gaLamutO sariraaka
peddaSaMkhamu bobba – peTTa boDage
Sreepati | needivya – rooputO sari raaka
puShpabaaNuDu neeku – butru Dayye

tE. niMdiraadEvi ninnu mO – hiMchi viDaka
neeku baTTamahiShi yayye – niSchayamuga.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.