Main Menu

Kuvalayasyaama Neekoluvu Chesina Naaku (కువలయశ్యామ నీకొలువు చేసిన నాకు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. కువలయశ్యామ | నీ – కొలువు చేసిన నాకు
జీత మెందుకు ముట్ట – జెప్పవైతి
మంచిమాటలచేత – గొంచెమియ్యగలేవు
కలహమౌ నిక జుమ్మి – ఖండితముగ
నీవు సాధువు గాన – నింత పర్యంతంబు
చనవుచే నిన్నాళ్లు – జరుపవలసె
నిక నే సహింప నీ – విపుడు నన్నేమైన
శిక్ష చేసిన జేయు – సిద్ధమయితి

తే. నేడు కరుణింపకుంటివా – నిశ్చయముగ
దెగబడితి చూడు నీతోడ – జగడమునకు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నల్ల కలువవంటి ఛామనఛాయ శరీరము కలవాడా.నరసింహా.నీ సేవచేసినందుకు జీతమిచ్చుటలేదెందుకు?మంచి మాటలను కొంచెముగూడా నీయమేమి?ఇక కొట్లాట తప్పదుసుమా.నీవు మంచివాడివని,సాధువని యిన్నాళ్ళు చనువుచే ఉపేక్షించితిని.యింక నేను సహింపజాలను తండ్రీ.నీవే శిక్షవిధించిన అనుభవించుటకు సిద్దముగా ఉన్నాను.ఇప్పుడు దయజూపకున్న స్వామీ నిశ్చయముగా నీతో జగడమునకు సిద్దమవుతాను.
.


Poem:

See. Kuvalayasyaama | Nee – Koluvu Chesina Naaku
Jeeta Memduku Mutta – Jeppavaiti
Mamchimaatalacheta – Gomchemiyyagalevu
Kalahamau Nika Jummi – Khamditamuga
Neevu Saadhuvu Gaana – Nimta Paryamtambu
Chanavuche Ninnaallu – Jarupavalase
Nika Ne Sahimpa Nee – Vipudu Nannemaina
Siksha Chesina Jeyu – Siddhamayiti

Te. Nedu Karunimpakumtivaa – Nischayamuga
Degabaditi Choodu Neetoda – Jagadamunaku.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. kuvalayaSyaama | nee – koluvu chEsina naaku
jeeta meMduku muTTa – jeppavaiti
maMchimaaTalachEta – goMchemiyyagalEvu
kalahamau nika jummi – khaMDitamuga
neevu saadhuvu gaana – niMta paryaMtaMbu
chanavuchE ninnaaLlu – jarupavalase
nika nE sahiMpa nee – vipuDu nannEmaina
SikSha chEsina jEyu – siddhamayiti

tE. nEDu karuNiMpakuMTivaa – niSchayamuga
degabaDiti chooDu neetODa – jagaDamunaku.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.