పద్యం:
సీ. లక్ష్మీశ | నీదివ్య – లక్షణగుణముల
వినజాల కెప్పుడు – వెఱ్ఱినైతి
నా వెఱ్ఱిగుణములు – నయముగా ఖండించి
నన్ను రక్షింపు మో – నళిననేత్ర |
నిన్ను నే నమ్మితి – నితరదైవముల నే
నమ్మలే దెప్పుడు – నాగశయన |
కాపాడినను నీవె – కష్టపెట్టిన నీవె
నీపాదకమలముల్ – నిరత మేను
తే. నమ్మియున్నాను నీపాద – నళినభక్తి
వేగ దయచేసి రక్షింపు – వేదవిద్య |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ నరసింహస్వామి! లక్ష్మీపతి! నీ యొక్క సద్గుణములన్నియు వినాలని ఉవ్విళ్లూరే వెఱ్ఱివాడిని.ఓ పద్మక్షా! ఆ వెఱ్ఱిపోవునట్లు నన్ను దీవించి రక్షింపుమో నళిననేత్రా! ఇతర దైవముల నేనెన్నడు నమ్మలేదు. కొలువలేదు. నిన్నే నమ్మితిని తండ్రీ! ఓ భుజగశయనా! నీటముంచిన పాలముంచిన నీవే గతి! నీ పాదపద్మములచే నేనెల్లపుడు వేడుకుంటున్నాను. నా పై దయ జూపుము తండ్రీ!
.
Poem:
See. Lakshmeesa | Needivya – Lakshanagunamula
Vinajaala Keppudu – Verxrxinaiti
Naa Verxrxigunamulu – Nayamugaa Khamdimchi
Nannu Rakshimpu Mo – Nalinanetra |
Ninnu Ne Nammiti – Nitaradaivamula Ne
Nammale Deppudu – Naagasayana |
Kaapaadinanu Neeve – Kashtapettina Neeve
Neepaadakamalamul – Nirata Menu
Te. Nammiyunnaanu Neepaada – Nalinabhakti
Vega Dayachesi Rakshimpu – Vedavidya |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. lakShmeeSa | needivya – lakShaNaguNamula
vinajaala keppuDu – verxrxinaiti
naa verxrxiguNamulu – nayamugaa khaMDiMchi
nannu rakShiMpu mO – naLinanEtra |
ninnu nE nammiti – nitaradaivamula nE
nammalE deppuDu – naagaSayana |
kaapaaDinanu neeve – kaShTapeTTina neeve
neepaadakamalamul – nirata mEnu
tE. nammiyunnaanu neepaada – naLinabhakti
vEga dayachEsi rakShiMpu – vEdavidya |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.