Main Menu

Mathyaavathaara Mai Maduguloopala Jocchi (మత్స్యావతార మై మడుగులోపల జొచ్చి)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. మత్స్యావతార మై – మడుగులోపల జొచ్చి
సోమకాసురు ద్రుంచి – చోద్యముగను
దెచ్చి వేదము లెల్ల – మెచ్చ దేవతలెల్ల
బ్రహ్మ కిచ్చితి వీవు – భళి | యనంగ
నా వేదముల నియ్య – నాచారనిష్ఠల
ననుభవించుచు నుందు – రవనిసురులు
సకలపాపంబులు – సమసిపోవు నటంచు
మనుజు లందఱు నీదు – మహిమ దెలిసి

తే. యుందు రరవిందనయన | నీ – యునికి దెలియు
వారలకు వేగ మోక్షంబు – వచ్చు ననఘ |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహా!మత్స్యావతారములో భీకర సముద్రమున జొచ్చి సోమకాసురని జంపి చిత్రముగ వేదములు తెచ్చి బ్రహ్మదేవునికిచ్చి దేవతలందరిచే భళియని పొగడించుకొంటివి.ఆ వేదాధ్యయనము లతో బ్రాహ్మణులు నిష్ఠతో ఆచారములను పాటించి సత్ప్రవర్తన గలిగి మెలగుచున్నారు.నీ మహిమచే అన్ని పాపములు పోవునని మనుజులు తెలియలేకున్నారు. అనఘా! నీవున్నావని నమ్మి కొలిచినవారికి వెంటనే మోక్షప్రాప్తి కలుగుటలేదా!(కలుగునని భావము)
.


Poem:
See. Matsyaavataara Mai – Madugulopala Jochchi
Somakaasuru Drumchi – Chodyamuganu
Dechchi Vedamu Lella – Mechcha Devatalella
Brahma Kichchiti Veevu – Bhali | Yanamga
Naa Vedamula Niyya – Naachaaranishthala
Nanubhavimchuchu Numdu – Ravanisurulu
Sakalapaapambulu – Samasipovu Natamchu
Manuju Lamdarxu Needu – Mahima Delisi

Te. Yumdu Raravimdanayana | Nee – Yuniki Deliyu
Vaaralaku Vega Mokshambu – Vachchu Nanagha |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. matsyaavataara mai – maDugulOpala jochchi
sOmakaasuru druMchi – chOdyamuganu
dechchi vEdamu lella – mechcha dEvatalella
brahma kichchiti veevu – bhaLi | yanaMga
naa vEdamula niyya – naachaaraniShThala
nanubhaviMchuchu nuMdu – ravanisurulu
sakalapaapaMbulu – samasipOvu naTaMchu
manuju laMdarxu needu – mahima delisi

tE. yuMdu raraviMdanayana | nee – yuniki deliyu
vaaralaku vEga mOkShaMbu – vachchu nanagha |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.