Main Menu

Mithilesha tanaya (మిథిలేశ తనయ)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: KaambhOji

28 harikaambhOji janya
Arohana : S R2 G3 M1 P D2 S
Avarohana : S N2 D2 P M1 G3 R2 S N3. P. D2. S

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

మిథిలేశ తనయ నా మితిలేని వెతల నీయధిపున-కెరికింపవే ఓ జనని
వ్యథ జేందు చున్నాను బుధ వినుతుని నా కథవిన రమ్మనవే ఓ జనని

చరణములు

1.పండ్రెండెండ్లాయెను బందీఖానను జిక్కి బాధింపుచున్నారిటు ఓ జనని
తండ్రి కరుణ్మానె తల్లి నీ కృపయెట్లో వేండ్రమాయె బ్రతుకు ఓ జనని

2.గదముద్గరాదుల గాసి పొందించిరి కరుణలేక భటులు ఓ జననీ
సదయాత్ముడీతీతి సావకాశమ్ము జేసే సంతోషమేమె నీకు ఓ జననీ

3.పరమ పురుషుడని పతిత పావననుడని పాండవ పక్షుడ్ని ఓ జననీ
కరిగాచి నాడని కాంక్షించి వేడితే కాలహరణము జేసేనే ఓ జననీ

4.కారాగ్రహంబున కనుగాన రాకను కఠిన శిక్షల బొందితి ఓ జననీ
భారాకుడితడని పరిపరి విధముల బ్రాణుతించి వేసారితి ఓ జనని

5.నిండువేసగిని యెండలో నిలిపిరి గుండుమీరి ఓ జననీ
కొండంత బరువాయేఎ మొండి జీవనము నా దండ యెవ్వరులేరే ఓ జననీ

6.ఉప్పిబియ్యము రెండు నుడక బెట్టుగ తినియున్నాడ నీ విధమున ఓ జననీ
అప్పనిను దప్పనన్యులులేరు దెప్పరములు దీర్ప ఓ జననీ

7.ఉదయమైనవెనుక నురగ శయనునితో-డుండజాల దనువులు ఓ జననీ
సదయాత్ముని పంపి సంతరించితివైన సద్కీర్తి దక్కునమ్మా ఓ జననీ

8.తానిషపైకము తడలేక తెమ్మని తహసీలు జెయించగా ఓ జననీ
మానవాధముడవై మనియుండూటకన్న మరణము మేలమ్మ ఓ జననీ

9.అతి దుఃఖమును బొందియలసటచేగుంది విషము ఓ జననీ
పతిత పావనునిపై భారము వేసి ప్రాణంబుల విడిచేద ఓ జననీ

10.పరమ పురుషనుకు బరికింపరాని ఈ పాపవు జన్మమేల ఓ జననీ
కరణత్రయంబుల కాకుత్స్థ తిలకుని కంఠెనయ్య మెరుగనే ఓ జననీ

11.ఎపుడైన మీదగు కృపజెందగలని వపువుంచితీవరకు ఓ జననీ
విపరీతము జూడ కపటాత్ములైతిరి విఫలము నా బ్రతుకు ఓ జననీ

12.స్థిరముగ భద్రాద్రిఖరిని సద్భక్త శేఖరుడై వెలసి ఓ జననీ
పరువడి రామదాసుని బ్రోవకున్నను పరువేలాగు దొరుకనే ఓ జననీ
.



Pallavi

mithilESa tanaya nA mitilEni vetala nIyadhipuna-kerikimpavE O janani
vyatha jEndu cunnAnu budha vinutuni nA kathavina rammanavE O janani

Charanams

1.panDrenDenDlAyenu bandIkhAnanu jikki bAdhimpucunnAriTu O janani
tanDri karuNmAne talli nI kRpayeTlO vEnDramAye bratuku O janani

2.gadamudgarAdula gAsi pondinciri karuNalEka bhaTulu O jananI
sadayAtmuDItIti sAvakASammu jEsE santOshamEme nIku O jananI

3.parama purushuDani patita pAvananuDani pAnDava pakshuDni O jananI
karigAci nADani kAnkshinci vEDitE kAlaharaNamu jEsEnE O jananI

4.kArAgrahambuna kanugAna rAkanu kaThina Sikshala bonditi O jananI
bhArAkuDitaDani paripari vidhamula brANutinci vEsAriti O janani

5.ninDuvEsagini yenDalO nilipiri gunDumIri O jananI konDanta baruvAyEe monDi jIvanamu nA danDa yevvarulErE O jananI

6.uppibiyyamu renDu nuDaka beTTuga tiniyunnADa nI vidhamuna O jananI
appaninu dappananyululEru depparamulu dIrpa O jananI

7.udayamainavenuka nuraga SayanunitO-DunDajAla danuvulu O jananI
sadayAtmuni pampi santarincitivaina sadkIrti dakkunammA O jananI

8.tAnishapaikamu taDalEka temmani tahasIlu jeyincagA O jananI
mAnavAdhamuDavai maniyunDUTakanna maraNamu mElamma O jananI

9.ati du@hkhamunu bondiyalasaTacEgundi vishamu O jananI
patita pAvanunipai bhAramu vEsi prANambula viDicEda O jananI

10.parama purushanuku barikimparAni I pApavu janmamEla O jananI
karaNatrayambula kAkutstha tilakuni kanThenayya meruganE O jananI

11.epuDaina mIdagu kRpajendagalani vapuvuncitIvaraku O jananI
viparItamu jUDa kapaTAtmulaitiri viphalamu nA bratuku O jananI

12.sthiramuga bhadrAdrikharini sadbhakta SEkharuDai velasi O jananI
paruvaDi rAmadAsuni brOvakunnanu paruvElAgu dorukanE O jananI

.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.