పద్యం:
సీ. మందుండనని నన్ను – నింద చేసిననేమి?
నా దీనతను జూచి – నవ్వ నేమి?
దూరభావములేక – తూలనాడిన నేమి?
ప్రీతిసేయక వంక – బెట్ట నేమి?
కక్కసంబులు పల్కి – వెక్కిరించిన నేమి?
తీవ్రకోపముచేత – దిట్ట నేమి?
హెచ్చుమాటలచేత – నెమ్మె లాడిన నేమి?
చేరి దాపట గేలి – చేయనేమి?
తే. కల్పవృక్షంబువలె నీవు – గల్గ నింక
బ్రజల లక్ష్యంబు నాకేల? – పద్మనాభ |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ నరశింహస్వామీ!మూర్ఖుడనని ప్రజలునన్ను నిందించినా సరే!నా దీనత్వమును జూచినవ్వినా సరే!మంచి చెడులనరయక దూషించినా సరే!మంచిని విడిచి వంకపెట్టినా సరే.సూటి పోటిమాటలతో వెక్కిరించినా సరే!తీవ్రకోపముతో దిట్టినా సరే ఎక్కువగా హేళన చేసినా సరే,చెంతకు చేరి ఎగతాళీ చేసినా సరే పద్మనాభా!కల్పవృక్షములాంటి నీవుండగా యితరుల లెక్కేమిటి తండ్రీ!
.
Poem:
See. Mamdumdanani Nannu – Nimda Chesinanemi?
Naa Deenatanu Joochi – Navva Nemi?
Doorabhaavamuleka – Toolanaadina Nemi?
Preetiseyaka Vamka – Betta Nemi?
Kakkasambulu Palki – Vekkirimchina Nemi?
Teevrakopamucheta – Ditta Nemi?
Hechchumaatalacheta – Nemme Laadina Nemi?
Ceri Daapata Geli – Cheyanemi?
Te. Kalpavrukshambuvale Neevu – Galga Nimka
Brajala Lakshyambu Naakela? – Padmanaabha |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. maMduMDanani nannu – niMda chEsinanEmi?
naa deenatanu joochi – navva nEmi?
doorabhaavamulEka – toolanaaDina nEmi?
preetisEyaka vaMka – beTTa nEmi?
kakkasaMbulu palki – vekkiriMchina nEmi?
teevrakOpamuchEta – diTTa nEmi?
hechchumaaTalachEta – nemme laaDina nEmi?
cEri daapaTa gEli – chEyanEmi?
tE. kalpavRukShaMbuvale neevu – galga niMka
brajala lakShyaMbu naakEla? – padmanaabha |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.