Main Menu

Nea Nentha Veadina Nee Kela Dhayaraadhu (నే నెంత వేడిన నీ కేల దయరాదు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. నే నెంత వేడిన – నీ కేల దయరాదు?
పలుమాఱు పిలిచిన – బలుక వేమి?
పలికిన నీ కున్న – పద వేమిబోవు? నీ
మోమైన బొడచూప – వేమి నాకు?
శరణు జొచ్చినవాని – సవరింపవలె గాక
పరిహరించుట నీకు – బిరుదు గాదు
నీదాసులను నీవు – నిర్వహింపక యున్న
బరు లెవ్వ రగుదురు – పంకజాక్ష |

తే. దాత దైవంబు తల్లియు – దండ్రి వీవె
నమ్మియున్నాను నీపాద – నళినములను.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
తండ్రీ నరసింహా!నేనెంతగా ప్రార్థించిననూ నీకేలదయరాదు?ఎన్నిమార్లు పిలిచినా పలుకవేమి తండ్రీ!పలికితే నీ గొప్పతనము పోవునని అనుమానమా?నీ ముఖారవిందమును నాకగపడనీయ వేమి?శరణన్న వానిని రక్షించవలెగాని నిర్లక్ష్యము చేయుట గొప్పతనముగాదు.నీ భక్తులను నీవు కాపాడుకున్న మరింకెవ్వరు కాపాడుదురయ్యా!ఓ పంకజాక్ష! నాకు నీవే తల్లి దండ్రివని నమ్మియున్నాను.నీ పాదపద్మములను పూజించుచున్నాను.త్వరగా కాపాడుము తండ్రీ!
.


Poem:
See. Ne Nemta Vedina – Nee Kela Dayaraadu?
Palumaarxu Pilichina – Baluka Vemi?
Palikina Nee Kunna – Pada Vemibovu? Nee
Momaina Bodachoopa – Vemi Naaku?
Saranu Jochchinavaani – Savarimpavale Gaaka
Pariharimchuta Neeku – Birudu Gaadu
Needaasulanu Neevu – Nirvahimpaka Yunna
Baru Levva Raguduru – Pamkajaaksha |

Te. Daata Daivambu Talliyu – Damdri Veeve
Nammiyunnaanu Neepaada – Nalinamulanu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. nE neMta vEDina – nee kEla dayaraadu?
palumaarxu pilichina – baluka vEmi?
palikina nee kunna – pada vEmibOvu? nee
mOmaina boDachoopa – vEmi naaku?
SaraNu jochchinavaani – savariMpavale gaaka
parihariMchuTa neeku – birudu gaadu
needaasulanu neevu – nirvahiMpaka yunna
baru levva raguduru – paMkajaakSha |

tE. daata daivaMbu talliyu – daMDri veeve
nammiyunnaanu neepaada – naLinamulanu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.