Main Menu

Nee Bhakthulanu Ganul Nindajoochiyu Rendu (నీ భక్తులను గనుల్ నిండ జూచియు రెండు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. నీ భక్తులను గనుల్ – నిండ జూచియు రెండు
చేతుల జోహారు – సేయువాడు
నేర్పుతో నెవరైన – నీ కథల్ చెప్పంగ
వినయమందుచు జాల – వినెడువాడు
తన గృహంబునకు నీ – దాసులు రా జూచి
పీటపై గూర్చుండ – బెట్టువాడు
నీసేవకుల జాతి – నీతు లెన్నక చాల
దాసోహ మని చేర – దలచువాడు

తే. పరమభక్తుండు ధన్యుండు – భానుతేజ |
వాని గనుగొన్న బుణ్యంబు – వసుధలోన.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ భూషణవికాస!నరసింహా! నీ భక్తులను నిండైన దృష్టితో జూచి నమస్కారము చేయువాడు, ఎవరైన చమత్కారముగా నీ కథలు చెప్పుచుండ అతివినయభక్తితో వినెడివాడు.నీ దాసులను మనస్ఫూర్తిగా తన గృహమునకు ఆహ్వానించువాడు, మంచి చెడ్డలు గణింపక నీ దాసుడనేనని మిగులభక్తితో దరిజేరువాడు ఈ ధరణీలో మిక్కిలి ధన్యుడు!ఓ భానుతేజ!ఈ పుడమిపై నట్టివానిని గన్న పుణ్యమే పుణ్యము.
.


Poem:
See. Nee Bhaktulanu Ganul – Nimda Joochiyu Remdu
Chetula Johaaru – Seyuvaadu
Nerputo Nevaraina – Nee Kathal Cheppamga
Vinayamamduchu Jaala – Vineduvaadu
Tana Gruhambunaku Nee – Daasulu Raa Joochi
Peetapai Goorchumda – Bettuvaadu
Neesevakula Jaati – Neetu Lennaka Chaala
Daasoha Mani Chera – Dalachuvaadu

Te. Paramabhaktumdu Dhanyumdu – Bhaanuteja |
Vaani Ganugonna Bunyambu – Vasudhalona.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. nee bhaktulanu ganul – niMDa joochiyu reMDu
chEtula jOhaaru – sEyuvaaDu
nErputO nevaraina – nee kathal cheppaMga
vinayamaMduchu jaala – vineDuvaaDu
tana gRuhaMbunaku nee – daasulu raa joochi
peeTapai goorchuMDa – beTTuvaaDu
neesEvakula jaati – neetu lennaka chaala
daasOha mani chEra – dalachuvaaDu

tE. paramabhaktuMDu dhanyuMDu – bhaanutEja |
vaani ganugonna buNyaMbu – vasudhalOna.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.