Main Menu

Neeku Dhaasuda Nantininnu Nammukayunti (నీకు దాసుడ నంటినిన్ను నమ్ముకయుంటి)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. నీకు దాసుడ నంటి – నిన్ను నమ్ముకయుంటి
గాన నాపై నేడు – కరుణజూడు
దోసిలొగ్గితి నీకు – ద్రోహ మెన్నగబోకు
పద్మలోచన | నేను – పరుడగాను
భక్తి నీపై నుంచి – భజన జేసెద గాని
పరుల వేడను జుమ్మి – వరము లిమ్ము
దండిదాతవు నీవు – తడవుసేయక కావు
ఘోరపాతకరాశి – గొట్టివైచి

తే. శీఘ్రముగ గోర్కు లీడేర్చు – చింత దీర్చు
నిరతముగ నన్ను బోషించు – నెనరు నుంచు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నాగేంద్రశయనా!నరశింహా!నీకు సేవకుడనై నిన్నే నమ్మియున్నాను తండ్రీ! నాపై దయచూపుము.దోసిలి యొగ్గి ప్రార్దిస్తున్నాను.ద్రోహము చేయకు స్వామీ!పద్మలోచన!పరాయివాడను గాను.నిన్ను భక్తి శ్రద్దలతో పొగుడుదును. గాని యితరులను కొలవను తండ్రీ!వరములిచ్చే గొప్పదాతవు నీవు.శీఘ్రముగా నన్ను రక్షింపుము తండ్రీ!నా యందలి గొప్ప పాపపు రాశిని పారద్రోలి త్వరగా కోర్కెలు దీర్చి ఈడేర్చుము తండ్రీ!దయవుంచి ఎల్లపుడు నన్ను కావుము నరసింహా!
.


Poem:
See. Neeku Daasuda Namti – Ninnu Nammukayumti
Gaana Naapai Nedu – Karunajoodu
Dosiloggiti Neeku – Droha Mennagaboku
Padmalochana | Nenu – Parudagaanu
Bhakti Neepai Numchi – Bhajana Jeseda Gaani
Parula Vedanu Jummi – Varamu Limmu
Damdidaatavu Neevu – Tadavuseyaka Kaavu
Ghorapaatakaraasi – Gottivaichi

Te. Seeghramuga Gorku Leederchu – Chimta Deerchu
Niratamuga Nannu Boshimchu – Nenaru Numchu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. neeku daasuDa naMTi – ninnu nammukayuMTi
gaana naapai nEDu – karuNajooDu
dOsiloggiti neeku – drOha mennagabOku
padmalOchana | nEnu – paruDagaanu
bhakti neepai nuMchi – bhajana jEseda gaani
parula vEDanu jummi – varamu limmu
daMDidaatavu neevu – taDavusEyaka kaavu
ghOrapaatakaraaSi – goTTivaichi

tE. Seeghramuga gOrku leeDErchu – chiMta deerchu
niratamuga nannu bOShiMchu – nenaru nuMchu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.