Main Menu

Neelameghasyama Neeve Thandrivi (నీలమేఘశ్యామ నీవె తండ్రివి)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. నీలమేఘశ్యామ | – నీవె తండ్రివి మాకు
కమలవాసిని మమ్ము – గన్నతల్లి
నీ భక్తవరులంత – నిజమైన బాంధవుల్
నీ కటాక్షము మా క – నేకధనము
నీ కీర్తనలు మాకు – లోక ప్రపంచంబు
నీ సహాయము మాకు – నిత్యసుఖము
నీ మంత్రమే మాకు – నిష్కళంకపు విద్య
నీ పద ధ్యానంబు – నిత్యజపము

తే. తోయజాతాక్ష నీ పాద – తులసిదళము
రోగముల కౌషధము బ్రహ్మ – రుద్రవినుత.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నీలమేఘశ్యామా! నరసింహా! మా తండ్రివి నీవే! నీ భార్యయైన లక్ష్మీదేవియే మమ్ముకన్నతల్లి! నీ భక్త శిఖామణులందరూ నాకు నిజమైన బంధువులే.నీవు చూపించే కటాక్షమే నాకు అపార ఐశ్వర్యము.నిన్ను కీర్తించుటయే నా ప్రపంచము.నీవు చేసే సహాయమే మేము నిత్యము పొందే ఆనందము.నీ హరినామ మంత్రమే మాకు నిష్కళంకమైన విద్య. నీ పదద్యానమే మా నిత్యజపము.ఓ కమలాక్షుడా!బ్రహ్మచేతనూ ఈశ్వరునిచేతనూ బొగడబడిన నీ పాదపద్మముల చెంతనున్న తులసీదళములే నా వ్యాధులకు ఔషధమువంటిది.
.


Poem:
See. Neelameghasyaama | – Neeve Tamdrivi Maaku
Kamalavaasini Mammu – Gannatalli
Nee Bhaktavarulamta – Nijamaina Baamdhavul
Nee Kataakshamu Maa Ka – Nekadhanamu
Nee Keertanalu Maaku – Loka Prapamchambu
Nee Sahaayamu Maaku – Nityasukhamu
Nee Mamtrame Maaku – Nishkalamkapu Vidya
Nee Pada Dhyaanambu – Nityajapamu

Te. Toyajaataaksha Nee Paada – Tulasidalamu
Rogamula Kaushadhamu Brahma – Rudravinuta.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. neelamEghaSyaama | – neeve taMDrivi maaku
kamalavaasini mammu – gannatalli
nee bhaktavarulaMta – nijamaina baaMdhavul
nee kaTaakShamu maa ka – nEkadhanamu
nee keertanalu maaku – lOka prapaMchaMbu
nee sahaayamu maaku – nityasukhamu
nee maMtramE maaku – niShkaLaMkapu vidya
nee pada dhyaanaMbu – nityajapamu

tE. tOyajaataakSha nee paada – tulasidaLamu
rOgamula kauShadhamu brahma – rudravinuta.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.