Main Menu

Neemeedha keerthanalnithyagaanamu Jeasi (నీమీద కీర్తనల్ నిత్యగానము జేసి)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. నీమీద కీర్తనల్ – నిత్యగానము జేసి
రమ్యమొందింప నా – రదుడగాను
సావధానముగ నీ – చరణ పంకజ సేవ
సలిపి మెప్పంపంగ – శబరిగాను
బాల్యమప్పటినుండి – భక్తి నీయందున
గలుగను బ్రహ్లాద – ఘనుడగాను
ఘనముగా నీమీది – గ్రంథముల్ గల్పించి
వినుతిసేయను వ్యాస – మునినిగాను

తే. సాధుడను మూర్ఖమతి మను – ష్యాధముడను
హీనుడను జుమ్మి నీవు – న న్నేలుకొనుము.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహా!నీ మీదకీర్తనలల్లి నిత్యము గానము చేసి రంజింప జేయుటకు నేనునారదుడనుగాను.తీరికగా నీ పదసేవజేసి మెప్పించుటకు శబరిని కాను,చిన్నతనమునుండీ నీయందే నీ భక్తిపారవశ్యమున తేలియాడుచున్న ప్రహ్లాదుడనుగాను,నీ మీద గొప్పగ్రంథములు పెక్కురచించి నిన్ను పొగడుదామన్న నేను వ్యాసమహర్షిని గాను. తండ్రీ! నేను బహుమెతకవాడిని,మూర్ఖుడను,అల్పమనుష్యుడను,హీనుడను నాయందు దయవుంచి నన్నేలుకొనుము తండ్రీ!
.


Poem:
See. Neemeeda Keertanal – Nityagaanamu Jesi
Ramyamomdimpa Naa – Radudagaanu
Saavadhaanamuga Nee – Charana Pamkaja Seva
Salipi Meppampamga – Sabarigaanu
Baalyamappatinumdi – Bhakti Neeyamduna
Galuganu Brahlaada – Ghanudagaanu
Ghanamugaa Neemeedi – Gramthamul Galpimchi
Vinutiseyanu Vyaasa – Muninigaanu

Te. Saadhudanu Moorkhamati Manu – Shyaadhamudanu
Heenudanu Jummi Neevu – Na Nnelukonumu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. neemeeda keertanal – nityagaanamu jEsi
ramyamoMdiMpa naa – raduDagaanu
saavadhaanamuga nee – charaNa paMkaja sEva
salipi meppaMpaMga – Sabarigaanu
baalyamappaTinuMDi – bhakti neeyaMduna
galuganu brahlaada – ghanuDagaanu
ghanamugaa neemeedi – graMthamul galpiMchi
vinutisEyanu vyaasa – muninigaanu

tE. saadhuDanu moorkhamati manu – ShyaadhamuDanu
heenuDanu jummi neevu – na nnElukonumu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.