Main Menu

Okati Padi (ఒకటీ – పదీ)

Sri Sri (శ్రీరంగం శ్రీనివాస రావు) popularly known as Sri Sri, was born on 2nd January 1910 in Visakhapatnam. Sri Sri completed his education in the same school in which his father Sri Venkata Ramaiah was working as a mathematics teacher. He married Ms. Venkata Ramanamma at an age of 15 and adapted a girl child. Later on he married Ms. Sarojini and was blessed with a son and two daughters.More...

Book Of Reference : Khadga Srushti

Book Published Year : 1966

Title of the Poem: Okati Padi

Language: Telugu (తెలుగు)

 


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This lyric was originally composed in Telugu. Other languages are for your convenience



ఈ ఫస్టోబరు రోజు ఎవరా వస్త
చెప్పండి కాస్త ఎవరా వస్తున్న రాజు
ఆరంభ మంగళముహూర్తం ఆసన్నమయింది
ఆహానం కోసం మా గానం ఆయత్తమయింది
అయితే ఆ వస్తున్నది ఆం అవునో కాదో
ఆసందించబోయే అనుభవం ఆఖరకు తీపో చేదో
శ్రీరాములుచుట్టి చిత్తగించవలెను దాకా
ప్రవహించిన విజయం ప్రభవించే తనయ
ఆం కాకపోతే ఏం అందులో ఒక ముక్క
ఆ ముక్కలో ఒక చెక్క అయినా ఇదే మా ఓం
అదో పదో నెల బాల
హాస విశాల
పుట్టింది కొస్తోంది
పూర్ణ గర్భిణి

తారంగం తారంగం లాలీ లాలీ
ఆనందం ఆనందం హాయీ హాయీ
శంఖాలూ ఢంకాలూ మ్రోగించండీ
స్నేహార్ద్రం సౌహార్దం సాధించండీ

రైలుబండి లేటయిందా
వంతెన చుట్టూ వరదలా
ఇంజన్ సరిగ్గాలేదూ
ఎందు కదంతా పోదూ

పూలదండతో
నిండింది స్టేషన్
కోటి గొంతుకలతో
పాడింది నేషన్
పదిలంగా పొగబండి
చేరింది డెస్టినేషన్
రారండీ రారండీ యావన్మందీ
ఆడండీ పాడండీ హ్లాదం చెందీ

ఆంధ్రరాష్ట్రం ఆగమనం
అసత్యం కాజాలని చారిత్రక వాగ్దానం
మన చరిత్రాత్మక నిరంతరాందోళన
చరితార్ధ మయిం దీనాడు

ఈ రాష్ట్రం ఇదిగో ఇప్పుడే చెబుతున్నా
ఏదో కొందరి సదుపాయాని కేర్పడలేదు.
ఎవరో కొంద రుద్యోగులకని వేర్పడలేదు

ముక్కోటి ఆంధ్రుల ఆకుంఠిత దీక్ష
అజేయ సంకల్పం
ఆంధ్రావతరణకి కారణం

ఈ రోజు ఊరేగింపులు జరుగుతాయ్ నిజమే
ఉత్సవాలు జరుగుతాయ్ నిజమే
ఉత్సాహం ఉప్పొంగుతుంది నిజమే
యాథావిథిగా అన్ని లాంఛనాలూ సాగుతాయ్ నిజమే

కాని ఆ లాంఛనాలన్నింటి తరాత
వచ్చిన అతిథులు వెళ్ళిపోయిన తరాత
పాటలూ ప్రసంగాలూ జయ జయధానాలూ చల్లబడ్డ తరాత

సంబరాల తరాత
సంపాదకీయాల తరాత
సామాన్య మానవుడి భుజస్కంధాల మీద
సమస్తభారం పడుతుంది
అతనిదీ ఈ రాష్ట్రం
అతనికోసం ఈ రాష్ట్రం
పెత్తనం చెయ్యాలని ముందుకొచ్చే
పెద్దలిది గ్రహించాలని హెచ్చరిక

శుభంగా శోభావహంగా
ఆకారం తాల్చుతున్న ఆంధ్రరాష్ట్రం
ఆంధ్రజాతి కంతటికీ విజయం
ఆంధ్ర సంస్కృతికి అఖండ విజయం
ముఖ్యంగా అతి ముఖ్యంగా
ఆంధ్రభాషకిది అపూర విజయం

ఇది వినండి మరి
విప్లవం మున్ముందు మనుష్యుని మనస్సులో ప్రారంభమవుతుంది
మన:ప్రపంచానికి బాహ్య విప్లవం
అందుకే ఈ ఆనంద సమయంలో
భాషలోనూ భావంలోనూ విప్లవం తెచ్చిన
మహా మానవులైన
మన గిడుగు గురజాడ వీరేశలింగం
మహానీయులను
నా మన:ఫలకంముందు సాక్షాత్కరింపజేసుకొని
నమస్కరిస్తున్నాను
వారిచ్చిన ఆశీరాదాలు
తీర్చిదిద్దిన ఒరవడులు
చిరకాలం మన ఆంధ్రావనికి
శ్రీరామరక్ష

దేవతలే మానవులే దీవించాలి
దేశంలో దేవతం దీపించాలి.

ఈ ఫస్టోబరు శుభవేళ
నిన్నటి మన సరూపం స్మరించి
నేటి మన సభావం గ్రహించి
రేపటి మన సమాజంకోసం కలిసిమెలిసి క్రమించుదాం

నిన్న మన ఓడరేవులనుంచి దేశదేశాలకి
మన నాగరికత నౌకాయానాలు చేసింది
నేడు మన రహదార్లు ఎద్దుబళ్ళకి ఏడుపు తెప్పిస్తున్నాయ్
ఇనుపదార్లు ఇరుకైపోయినాయి
రేపు మన విశాలాంధ్ర విమానాశ్రయాలనుంచి
మహాకాశాల్లో మన విమానాలు ప్రయాణం చేస్తాయ్.

నిన్నటి మన రాజనగరాల్లో
రత్నరాసుల విపణిమీధులు
విదేసీయులకి విభ్రాంతి కలిగించాయ్
నేడు పట్టణాల పాలకసంఘాలు
దరిద్రాలును తరిమి వెయ్యలేక
అంధకారాన్ని అరికట్టలేక
అలమటించి అల్లాడుతున్నయ్.

రేపటి మన జల విద్యుత్ ప్రణాళికలు
సిమెంట్ కాంక్రీట్ వినిర్మాణాలు
ట్రాక్టర్లు బుల్ డోజర్లు
పారిశ్రామిక వ్యవసాయక సహసమానాభివృద్ధితో
ప్రతి కుటుంబానికీ ఒక నివాసగృహం చూపిస్తాయ్
ప్రతివ్యక్తి చేతికీ ఒక పని కల్పిస్తాయ్
ప్రతి మనస్సులో ఒక పరిశుభ్రమైన గీతం పలికిస్తాయ్.
నిన్న మనదేశం మహామంత్రులైన అక్కన మాదన్నలని లోకానికిచ్చింది.

నేడు మంత్రి పదవుల మంతనాలతో వాతావరణంలో
దుమ్ముదుమారం చెలరేగింది
రేపు జాతినంతటినీ ఏకమార్గంలో నడిపించి
అఖిలభారతావనికే ఆదర్శం చూపించగల
మహానాయకుడు మనకు లభిస్తాడు

నిన్న తమకంటే హెచ్చువారి కాళ్ళుపట్టుకొని కొలిచి
తమకన్న తక్కువవారిని కాళ్ళకిందపట్టి అణచి
చిరునవుతో స్తిమితంగా సర్దుకుపోయే మనస్తతం
నేడు ఆ మనస్తతపు అవశేషాల నెదిరించి
పోరాడుతున్నవారి తిరుగుబాటు
రేగించిన ప్రచండ సంఘర్షణల
ప్రభంజన గర్జన

రేపు మానవుడు మానవుని లోని మాన
వతం గుర్తించి మహనీయులై
సరికొత్త మర్యాదలు సృష్టించే
మహత్తరకాలం

నిన్న కంతానికి రాజాధిరాజుల ఆదరణ
నేడు ప్రభువులలో పరిపాలకులలో ఇంకిపోతూన్న రసహృదయం
ఆనందానికి అవకాశాలూ తీరుబాటూలేని
అసంఖ్యాక ప్రజానీకం
రేపు మేలుకొన్న ప్రజలు శిరస్సున ధరించి
ఆదరించే అతి నవీన కంతామాధుర్యం
సంతోషం సంరంభం నేడే నేడే
సౌమార్గ్యం సౌభాగ్యం రేపే రేపే


Awaiting Contribution.


Awaiting Contribution.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.