Main Menu

Paanchabaothikamu dhurbalamaina Kaayam bi (పాంచభౌతికము దుర్బలమైన కాయం బి)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. పాంచభౌతికము దు – ర్బలమైన కాయం బి
దెప్పుడో విడుచుట – యెఱుకలేదు
శతవర్షములదాక – మితము జెప్పిరి గాని
నమ్మరా దామాట – నెమ్మనమున
బాల్యమందో మంచి – ప్రాయమందో లేక
ముదిమియందో లేక – ముసలియందొ
యూరనో యడవినో – యుదకమధ్యముననో
యెప్పుడో విడుచుట – యేక్షణంబొ

తే. మరణమే నిశ్చయము బుద్ధి – మంతుడైన
దేహమున్నంతలో మిమ్ము – దెలియవలయు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహా!పంచభూతములతో నిండిన భరింపనలవికాని శరీరమిది. ఎప్పుడు కూలునోఎవరికెఱుక? నూరు సంవత్సరాల వయసని “శతమానః భవతి శతాయిష్షు”ని అందురేకాని ఆ మాట నమ్మశక్యమగుట లేదు. బాల్యంలోనో, ప్రాయము వచ్చిన తరువాతనో లేక వయస్సయిన తర్వాతనో లేక దేహమందు పూర్తిగా శక్తియుడిగిన తర్వాతనో ఎప్పుడు పోవునో చెప్పుట కష్టము,అదీగాక ఊరిలోనో,అడవిలోనో,నీటిలోనో ఎప్పుడో,ఏ సమయంలోనో,ఏ క్షణంలోనో ఈ దేహమునకు మరణము తప్పదు.దేహమున్నపుడే జ్ఞానినై నిన్ను ధ్యానించును.
.


Poem:
See. Paamchabhautikamu Du – Rbalamaina Kaayam Bi
Deppudo Viduchuta – Yerxukaledu
Satavarshamuladaaka – Mitamu Jeppiri Gaani
Nammaraa Daamaata – Nemmanamuna
Baalyamamdo Mamchi – Praayamamdo Leka
Mudimiyamdo Leka – Musaliyamdo
Yoorano Yadavino – Yudakamadhyamunano
Yeppudo Viduchuta – Yekshanambo

Te. Maraname Nischayamu Buddhi – Mamtudaina
Dehamunnamtalo Mimmu – Deliyavalayu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. paaMchabhautikamu du – rbalamaina kaayaM bi
deppuDO viDuchuTa – yerxukalEdu
SatavarShamuladaaka – mitamu jeppiri gaani
nammaraa daamaaTa – nemmanamuna
baalyamaMdO maMchi – praayamaMdO lEka
mudimiyaMdO lEka – musaliyaMdo
yooranO yaDavinO – yudakamadhyamunanO
yeppuDO viDuchuTa – yEkShaNaMbo

tE. maraNamE niSchayamu buddhi – maMtuDaina
dEhamunnaMtalO mimmu – deliyavalayu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.