Main Menu

Padhmalochana (పద్మలోచన)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. పద్మలోచన | సీస – పద్యముల్ నీ మీద
జెప్పబూనితినయ్య | – చిత్తగింపు
గణ యతి ప్రాస ల – క్షణము జూడగలేదు
పంచకావ్య శ్లోక – పఠన లేదు
అమరకాండత్రయం – బరసి చూడగలేదు
శాస్త్రీయ గ్రంధముల్ – చదువలేదు
నీ కటాక్షంబున – నే రచించెద గాని
ప్రఙ్ఞ నాయది గాదు – ప్రస్తుతింప

తే. దప్పుగలిగిన సద్భక్తి – తక్కువౌనె
చెఱకునకు వంకపోయిన – చెడునె తీపు?
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ పద్మనేత్రా! నరసింహస్వామీ! నీ పై సీసపద్యములు వ్రాయ తలచితిని వినుము తండ్రీ! గణ, యతి, ప్రాస లక్షణములు నాకు తెలియవు, పంచకావ్యములైన కుమారసంభవము, రఘువంశము, కిరాతార్జునీయము, శృంగార నైషధము, మాఘముల శ్లోకములన్ను నేను చదువలేదు.త్రికాండయైన అమరము నాకు తెలియదు. వ్యాకరణ, తర్క, వేదాంత శాస్త్రములు చదువుకొనలేదు. నీ కరుణా కటాక్షవీక్షణము చేత మాత్రమే వ్రాయ పూనుకొంటిని, నిన్ను ప్రస్తుతించే ప్రజ్ఞ నా వద్ద లేదు. తప్పు మిగిలిన నా సద్భక్తి తక్కువగునా? (తగ్గదని భావము) వంకరగా నున్నను చెఱకుగడ తీపి చెడునా? చెడదు. అటులనే నా భక్తి గూడ తప్పుపోయిననూ ఇసుమంతయూ తగ్గదని భావము.
.


Poem:
See. Padmalochana | Seesa – Padyamul Nee Meeda
Jeppaboonitinayya | – Chittagimpu
Gana Yati Praasa La – Kshanamu Joodagaledu
Pamchakaavya Sloka – Pathana Ledu
Amarakaamdatrayam – Barasi Choodagaledu
Saastreeya Gramdhamul – Chaduvaledu
Nee Kataakshambuna – Ne Rachimcheda Gaani
Pragnya Naayadi Gaadu – Prastutimpa

Te. Dappugaligina Sadbhakti – Takkuvaune
Cherxakunaku Vamkapoyina – Chedune Teepu?
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. padmalOchana | seesa – padyamul nee meeda
jeppaboonitinayya | – chittagiMpu
gaNa yati praasa la – kShaNamu jooDagalEdu
paMchakaavya SlOka – paThana lEdu
amarakaaMDatrayaM – barasi chooDagalEdu
Saastreeya graMdhamul – chaduvalEdu
nee kaTaakShaMbuna – nE rachiMcheda gaani
pragnya naayadi gaadu – prastutiMpa

tE. dappugaligina sadbhakti – takkuvaune
cherxakunaku vaMkapOyina – cheDune teepu?
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.