Main Menu

Sakalavidhyalu Neerchi Sabha Jayimpagavacchu (సకలవిద్యలు నేర్చి సభ జయింపగవచ్చు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. సకలవిద్యలు నేర్చి – సభ జయింపగవచ్చు
శూరుడై రణమందు – బోరవచ్చు
రాజరాజై పుట్టి – రాజ్య మేలగవచ్చు
హేమ గోదానంబు – లియ్యవచ్చు
గగనమం దున్న చు – క్కల నెంచగావచ్చు
జీవరాసుల పేళ్లు – చెప్పవచ్చు
నష్టాంగయోగము – లభ్యసింపగవచ్చు
మేక రీతిగ నాకు – మెసవవచ్చు

తే. తామరసగర్భ హర పురం – దరులకైన
నిన్ను వర్ణింప దరమౌనె – నీరజాక్ష |
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నీరజాక్ష!నరశింహస్వామీ!సకల విద్యలనభ్యసించి సభను జయింపగవచ్చు గొప్ప పరాక్రముడై రణమందు పోరుసల్పవచ్చు. రాజరాజై రాజ్యమేలగవచ్చు.బంగారము,గోదానము వంటి దానములీయగవచ్చు. ఆకాశమందలి నక్షత్రాలను లెక్కింపగావచ్చు. అన్ని జీవరాసులపేర్లు చెప్పవచ్చు.అష్టాంగ యోగములను నేర్చుకొనవచ్చు. కష్టముగానైననూ కఠినశిలలను మ్రింగవచ్చు.కాని బ్రహ్మేశ్వరులకుగాని,ఇంద్రునకుగాని వర్ణించనలవికాని నిన్ను మేమెట్లు వర్ణించగలము.(అనగా శక్తి చాలదని భావము).
.


Poem:
See. Sakalavidyalu Nerchi – Sabha Jayimpagavachchu
Soorudai Ranamamdu – Boravachchu
Raajaraajai Putti – Raajya Melagavachchu
Hema Godaanambu – Liyyavachchu
Gaganamam Dunna Chu – Kkala Nemchagaavachchu
Jeevaraasula Pellu – Cheppavachchu
Nashtaamgayogamu – Labhyasimpagavachchu
Meka Reetiga Naaku – Mesavavachchu

Te. Taamarasagarbha Hara Puram – Darulakaina
Ninnu Varnimpa Daramaune – Neerajaaksha |
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. sakalavidyalu nErchi – sabha jayiMpagavachchu
SooruDai raNamaMdu – bOravachchu
raajaraajai puTTi – raajya mElagavachchu
hEma gOdaanaMbu – liyyavachchu
gaganamaM dunna chu – kkala neMchagaavachchu
jeevaraasula pELlu – cheppavachchu
naShTaaMgayOgamu – labhyasiMpagavachchu
mEka reetiga naaku – mesavavachchu

tE. taamarasagarbha hara puraM – darulakaina
ninnu varNiMpa daramaune – neerajaakSha |
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.