Main Menu

Thalligarbhamunundi dhanamu The (తల్లిగర్భమునుండి ధనము తే)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. తల్లిగర్భమునుండి – ధనము తే డెవ్వడు
వెళ్లిపోయెడినాడు – వెంటరాదు
లక్షాధికారైన – లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు – మ్రింగబోడు
విత్త మార్జనజేసి – విఱ్ఱవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము – తోడరాదు
పొందుగా మఱుగైన – భూమిలోపల బెట్టి
దానధర్మము లేక – దాచి దాచి

తే. తుదకు దొంగల కిత్తురో – దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా – తెరువరులకు?
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ భూషణవికాస ! నరసింహా! పుట్టినప్పుడు తన తల్లి గర్భమునుండి ఏవిదమైన ధనము తీసుకురాడు. అలాగే పోయేటప్పుడు కూడా పట్టుకుపోడు.ఎంత ధనవంతుడైన తనజానెడు పొట్టకు ఉప్పు కలిసిన మెతుకులేగానీ సంపాదించిన బంగారాన్ని మ్రింగబోడు.నేనింత సంపాదించినానని గర్వపడుతాడే గాని తను కూడబెట్టిన సొమ్మును కుడవలేడెవ్వడు. దాన ధర్మములు చేయక ధరణిలో దాచిన ఆ ధనము తుదకు దొంగలకిత్తురో లేక దొరలపాలగునో ఎవరికెఱుక. తేనెటీగలు కష్టపడి తాము దాచిన తేనెను తెరువరల కిచ్చుటలేదా?(అనగా బాటసారుల పాలగుతున్నదని భావము) కావున దానధర్మములు చేసిన సొమ్ము మాత్రమే ధరణిలో కీర్తింపబడును.
.


Poem:
See. Talligarbhamunumdi – Dhanamu Te Devvadu
Vellipoyedinaadu – Vemtaraadu
Lakshaadhikaaraina – Lavana Manname Kaani
Merxugu Bamgaarambu – Mrimgabodu
Vitta Maarjanajesi – Virxrxaveegute Kaani
Koodabettina Sommu – Todaraadu
Pomdugaa Marxugaina – Bhoomilopala Betti
Daanadharmamu Leka – Daachi Daachi

Te. Tudaku Domgala Kitturo – Dorala Kavuno
Tene Jumteega Liyyavaa – Teruvarulaku?
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. talligarbhamunuMDi – dhanamu tE DevvaDu
veLlipOyeDinaaDu – veMTaraadu
lakShaadhikaaraina – lavaNa manname kaani
merxugu baMgaaraMbu – mriMgabODu
vitta maarjanajEsi – virxrxaveeguTe kaani
kooDabeTTina sommu – tODaraadu
poMdugaa marxugaina – bhoomilOpala beTTi
daanadharmamu lEka – daachi daachi

tE. tudaku doMgala kitturO – dorala kavuno
tEne juMTeega liyyavaa – teruvarulaku?
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.