పద్యం:
సీ. తిరుపతి స్థలమందు – దిన్నగా నే నున్న
వేంకటేశుడు మేత – వేయలేడొ?
పురుషోత్తమమున కే – బోయనజాలు జ
గన్నాథు డన్నంబు – గడపలేడొ?
శ్రీరంగమునకు నే – జేర బోయిన జాలు
స్వామి గ్రాసము బెట్టి – సాకలేడొ?
కాంచీపురములోన – గదిసి నే గొలువున్న
గరివరదుడు పొట్ట – గడపలేడొ?
తే. యెందు బోవక నేను నీ – మందిరమున
నిలిచితిని నీకు నామీద – నెనరు లేదు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |
తాత్పర్యం:
ఓ నరసింహా!తిరుపతియందునున్న వెంకటేశ్వరుడు నన్ను బోషింపలేడా!పూరిజగన్నాథములో యున్న జగన్నాథుడు నాకు జావపోయలేడా!శ్రీరంగపట్టణమునకు బోయిన నా స్వామినన్ను సాకలేడా!కాంచీపురమున నున్న ఆ శ్రీహరి నన్ను కావలేడా!నేను ఎక్కడికి పోకుండ యిక్కడనే నీ వద్దనే యున్నాను.కాని యింకనూ నా మీద దయరాలేదేమి తండ్రీ!
.
Poem:
See. Tirupati Sthalamamdu – Dinnagaa Ne Nunna
Vemkatesudu Meta – Veyaledo?
Purushottamamuna Ke – Boyanajaalu Ja
Gannaathu Dannambu – Gadapaledo?
Sreeramgamunaku Ne – Jera Boyina Jaalu
Svaami Graasamu Betti – Saakaledo?
Kaamcheepuramulona – Gadisi Ne Goluvunna
Garivaradudu Potta – Gadapaledo?
Te. Yemdu Bovaka Nenu Nee – Mamdiramuna
Nilichitini Neeku Naameeda – Nenaru Ledu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |
.
see. tirupati sthalamaMdu – dinnagaa nE nunna
vEMkaTESuDu mEta – vEyalEDo?
puruShOttamamuna kE – bOyanajaalu ja
gannaathu DannaMbu – gaDapalEDo?
SreeraMgamunaku nE – jEra bOyina jaalu
svaami graasamu beTTi – saakalEDo?
kaaMcheepuramulOna – gadisi nE goluvunna
garivaraduDu poTTa – gaDapalEDo?
tE. yeMdu bOvaka nEnu nee – maMdiramuna
nilichitini neeku naameeda – nenaru lEdu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |
.
No comments yet.