Main Menu

Vaanchatho Balichakravarthidhaggara Jeari (వాంఛతో బలిచక్రవర్తిదగ్గర జేరి)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. వాంఛతో బలిచక్ర – వర్తిదగ్గర జేరి
భిక్షమెత్తితి వేల – బిడియపడక?
యడవిలో శబరి ది – య్యని ఫలా లందియ్య
జేతులొగ్గితి వేల – సిగ్గుపడక?
వేడ్కతో వేవేగ – విదురునింటికి నేగి
విందుగొంటి వదేమి – వెలితిపడక?
అడుకు లల్పము కుచే – లుడు గడించుక తేర
బొక్కసాగితి వేల – లెక్కగొనక?

తే. భక్తులకు నీవు పెట్టుట – భాగ్యమౌను
వారి కాశించితివి తిండి – వాడ వగుచు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహావతారమూర్తీ!కోరి సిగ్గులేక బలిచక్రవర్తి దగ్గరకు చేఱి ఏల బిచ్చమెత్తితివి?అడవిలో శబరి యిచ్చిన ఎంగిలి పండ్లను ఏల తీసుకొంటివి?వేడ్కతో విదురునింటికిపోయి మొగమాటము లేక విందేలనారగించితివి?పిడికెడు అటుకులను కొండంత ఆశతో కుచేలుడు తీసుకొనిరాగా లెక్కపెట్టక మెక్కసాగితివి ఎందుకు?నీవు భక్తులకిచ్చుట భళియగునుగాని వారితిండికాశించి తిండిపోతువెందు లకైనావు?ఇందలి సూక్ష్మమేమిటి దండ్రీ!
.


Poem:
See. Vaamcato Balichakra – Vartidaggara Jeri
Bhikshamettiti Vela – Bidiyapadaka?
Yadavilo Sabari Di – Yyani Phalaa Lamdiyya
Jetuloggiti Vela – Siggupadaka?
Vedkato Vevega – Vidurunimtiki Negi
Vimdugomti Vademi – Velitipadaka?
Aduku Lalpamu Kuche – Ludu Gadimchuka Tera
Bokkasaagiti Vela – Lekkagonaka?

Te. Bhaktulaku Neevu Pettuta – Bhaagyamaunu
Vaari Kaasimchitivi Timdi – Vaada Vaguchu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. vaaMCatO balichakra – vartidaggara jEri
bhikShamettiti vEla – biDiyapaDaka?
yaDavilO Sabari di – yyani phalaa laMdiyya
jEtuloggiti vEla – siggupaDaka?
vEDkatO vEvEga – viduruniMTiki nEgi
viMdugoMTi vadEmi – velitipaDaka?
aDuku lalpamu kuchE – luDu gaDiMchuka tEra
bokkasaagiti vEla – lekkagonaka?

tE. bhaktulaku neevu peTTuTa – bhaagyamaunu
vaari kaaSiMchitivi tiMDi – vaaDa vaguchu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.