Main Menu

Vyaasu Dea Kulamandhu Vaasigaa Janminche (వ్యాసు డే కులమందు వాసిగా జన్మించె)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. వ్యాసు డే కులమందు – వాసిగా జన్మించె?
విదురు డే కులమందు – వృద్ధి బొందె?
గర్ణు డేకులమందు – ఘనముగా వర్ధిల్లె?
నా వసిష్ఠుం డెందు – నవతరించె?
నింపుగా వాల్మీకి – యే కులంబున బుట్టె?
గుహు డను పుణ్యు డే – కులమువాడు?
శ్రీశుకు డెక్కట – జెలగి జన్మించెను?
శబరి యేకులమందు – జన్మమొందె?

తే. నే కులంబున వీ రింద – ఱెచ్చినారు?
నీకృపాపాత్రులకు జాతి – నీతు లేల?
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరశింహస్వామీ!పరమేశ్వరా!ఈశ్వరా!వ్యాసమహర్షియే కులమందు పుట్టినాడు. విదురునికులమేది? కర్ణుడేకులమందు ఘనముగా వర్థిల్లినాడు, వశిష్టమహర్షిఎందు జన్మించే?వాల్మీకి మహర్షిదే కులము? పుణ్యగుహుడే కులమువాడు? శ్రీ కృష్ణుడెచ్చట జన్మించెను? శబరికులమేది? వీరందరు ఏ కులమున బుట్టి యే కులమున బెరిగినారు. ఉచ్చనీచజాతులలో పుట్టిన వీరందరూ నీ కృపాపాత్రులుకాలేదా?కావున నీ కృపను బొందుటకు జాతినీతులతో పని లేదని యర్థము.
.


Poem:
See. Vyaasu De Kulamamdu – Vaasigaa Janmimche?
Viduru De Kulamamdu – Vruddhi Bomde?
Garnu Dekulamamdu – Ghanamugaa Vardhille?
Naa Vasishthum Demdu – Navatarimche?
Nimpugaa Vaalmeeki – Ye Kulambuna Butte?
Guhu Danu Punyu De – Kulamuvaadu?
Sreesuku Dekkata – Jelagi Janmimchenu?
Sabari Yekulamamdu – Janmamomde?

Te. Ne Kulambuna Vee Rimda – Rxechchinaaru?
Neekrupaapaatrulaku Jaati – Neetu Lela?
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. vyaasu DE kulamaMdu – vaasigaa janmiMche?
viduru DE kulamaMdu – vRuddhi boMde?
garNu DEkulamaMdu – ghanamugaa vardhille?
naa vasiShThuM DeMdu – navatariMche?
niMpugaa vaalmeeki – yE kulaMbuna buTTe?
guhu Danu puNyu DE – kulamuvaaDu?
SreeSuku DekkaTa – jelagi janmiMchenu?
Sabari yEkulamaMdu – janmamoMde?

tE. nE kulaMbuna vee riMda – rxechchinaaru?
neekRupaapaatrulaku jaati – neetu lEla?
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.