Main Menu

Ipati valapulu (ఈపాటి వలపులు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 39 ; Volume No.7

Copper Sheet No. 107

Pallavi: Ipati valapulu (ఈపాటి వలపులు)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

ఈపాటి వలపులు యెఱఁగనివా
పోపో ఆతనికేల బుద్ధి చెప్పేరే

చరణములు

1.మనసు ముట్టినఁ గాని మాటలూనుఁ జవిగావు
తనువు సోఁకినఁ గాని తనివి లేదు
చనువులిచ్చినఁ గాని సరసములు చెల్లవు
పెనఁగి యాతనినేల పెరరేఁచేరే

2.తప్పక చూచినఁగాని దగ్గరి రాఁగొలుపదు
చెప్పుడుసుద్దులఁ గాని చింతదీరదు
చొప్పుగా నవ్వినఁ గాని చుట్టరికము నిండదు
యిప్పుడే యాతనినేల యేసపెట్టేరే

3.ఏకతమయ్యినఁ గాని యెరవులు విడువవు
రాకలఁ బోకలఁ గాని రతివుట్టదు
కైకొని శ్రీ వేంకటాద్రిఘనుఁడిట్టె నన్నుఁ గూడె
యీకడ యాతనినేల యియ్యకొలిపేరే

.

Pallavi

IpATi valapulu ye~ra@mganivA
pOpO AtanikEla buddhi cheppErE

Charanams

1.manasu muTTina@m gAni mATalUnu@m javigAvu
tanuvu sO@mkina@m gAni tanivi lEdu
chanuvulicchina@m gAni sarasamulu chellavu
pena@mgi yAtaninEla perarE@mchErE

2.tappaka chUchina@mgAni daggari rA@mgolupadu
cheppuDusuddula@m gAni chiMtadIradu
choppugA navvina@m gAni chuTTarikamu niMDadu
yippuDE yAtaninEla yEsapeTTErE

3.Ekatamayyina@m gAni yeravulu viDuvavu
rAkala@m bOkala@m gAni rativuTTadu
kaikoni SrI vEnkaTAdrighanu@mDiTTe nannu@m gUDe
yIkaDa yAtaninEla yiyyakolipErE

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.