Main Menu

Adame Yimkanemee (ఆడమె యింకనేమీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 203 | Keerthana 13, Volume 8

Pallavi:Adame Yimkanemee (ఆడమె యింకనేమీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడమె యింకనేమీ నౌఁగాదనుచుఁ దన్ను
సూడుఁబాడు దిద్దేవాఁడు సుద్దులిన్ని నేరఁడా   ॥పల్లవి॥

పెక్కులు నేర్చినతఁడు బెంబాడిచేఁతలతఁడు
దిక్కులఁ దననేరాలు దిద్దుకోలేఁడా
చక్కని పదారువేలు సతులఁ దెచ్చినతఁడు
పక్కన మావంటివారి భ్రమయించనోపఁడా    ॥ఆడ॥

రాతిరిపనులాతఁడు రవ్వల కెక్కినతఁడు
భీతిలేక ఆనలెల్లాఁ బెట్టుకోలేఁడా
ఈతల రుక్మిణీదేవి నెత్తుక తెచ్చినతఁడు
చేతులు మాపై జాఁచి చెనకక మానునా      ॥ఆడ॥

దేవర దానై నతఁడు దిమ్మరివిద్యలతఁడు
యీవేళ నాకోరిక యీడేర్చలేఁడా
శ్రీ వేంకటేశుఁ డితఁడు చేరి నన్నునిటు గూడె
వేవేలు మన్ననలచే వెలయించుటరుదా    ॥ఆడ ॥

Pallavi

Āḍame yiṅkanēmī naum̐gādanucum̐ dannu
sūḍum̐bāḍu diddēvām̐ḍu suddulinni nēram̐ḍā

1.Pekkulu nērcinatam̐ḍu bembāḍicēm̐talatam̐ḍu
dikkulam̐ dananērālu diddukōlēm̐ḍā
cakkani padāruvēlu satulam̐ deccinatam̐ḍu
pakkana māvaṇṭivāri bhramayin̄canōpam̐ḍā

2.Rātiripanulātam̐ḍu ravvala kekkinatam̐ḍu
bhītilēka ānalellām̐ beṭṭukōlēm̐ḍā
ītala rukmiṇīdēvi nettuka teccinatam̐ḍu
cētulu māpai jām̐ci cenakaka mānunā

3.Dēvara dānai natam̐ḍu dim’marividyalatam̐ḍu
yīvēḷa nākōrika yīḍērcalēm̐ḍā
śrī vēṅkaṭēśum̐ ḍitam̐ḍu cēri nannuniṭu gūḍe
vēvēlu mannanalacē velayin̄cuṭarudā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.