Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 332 | Keerthana 187 , Volume 4
Pallavi: Amduku Harikatha (అందుకు హరికథ)
ARO: Pending
AVA: Pending
Ragam: Malahari
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అందుకు హరికథయను తీర్థంబున
నింద వాసె నిఁక నిర్మలమైతి ॥ పల్లవి ॥
కంతునిముట్టంటు గలసె మదిలో
యెంతట శుద్ధౌనో యెరఁగమిఁక
సంతత సంసార జలధుల మునిఁగెద
పొంతగర్మము పోదింకాను ॥ అందు ॥
మాయపు టాసల మాలు గలసె మది
యేయెడ శుద్ధౌనో యెరఁగమిఁక
ఆయపుభవములయనలము చొచ్చితి
పోయినఁగర్మము పోదింకాను ॥ అందు ॥
చక్కఁగఁ గలిదోసము గలసెను మది
నెక్కడ వోయెనో యెరఁగమిఁక
దక్కి శ్రీవేంకటదైవముఁ గొలిచితి
పుక్కట గర్వము పోదింకాను ॥అందు॥
Pallavi
Anduku harikathayanu tīrthambuna
ninda vāse nim̐ka nirmalamaiti
Charanams
1.Kantunimuṭṭaṇṭu galase madilō
yentaṭa śud’dhaunō yeram̐gamim̐ka
santata sansāra jaladhula munim̐geda
pontagarmamu pōdiṅkānu
2.Māyapu ṭāsala mālu galase madi
yēyeḍa śud’dhaunō yeram̐gamim̐ka
āyapubhavamulayanalamu cocciti
pōyinam̐garmamu pōdiṅkānu
3.Cakkam̐gam̐ galidōsamu galasenu madi
nekkaḍa vōyenō yeram̐gamim̐ka
dakki śrīvēṅkaṭadaivamum̐ goliciti
pukkaṭa garvamu pōdiṅkānu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.