Main Menu

Anniyu Nadagave (అన్నియు నడగవే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 143 | Keerthana 189 , Volume 2

Pallavi: Anniyu Nadagave (అన్నియు నడగవే)
ARO: Pending
AVA: Pending

Ragam: Gujjari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు నడుగవే నేనే మఱచితి నవి హరి నీకే తెలిసినవి
మన్నించి నా కీజన్మ మొసఁగితివి మర్మగాఁడు మన్మథుఁడొఁకడు  ॥ పల్లవి ॥

పలుజన్మంబులు నేఁ ద్రాగిన చనుఁబాలు గొలిచితే నెన్నౌనో
తలిదండ్రులు మరియెందరో తా మెక్కడ నున్నారో
తిలకింపఁగ నాహారంబునకును తెగినకొలుచు లవి యెన్నెన్నో
యిలపై నే బ్రదికినకాలము యెంతని వ్రాసెనో చిత్రగుప్తుఁడు    ॥ అన్ని ॥

చినుఁగఁగఁ జినుఁగఁగఁ గట్టుకోకలకుఁ జెల్లినపత్తి దా నదియంతో
కనక మెంతో నాకాభరణములై కాయంబులతో నొరసినది
పెనఁగీ రమించిన కామినీమణుల పేరు లెన్నియో తొల్లిటివి
ఘనముగ నను నిటు భోగించఁజేసిన కర్మమే యెఱుఁగు నివియెల్లా ॥ అన్ని ॥

గరిమల నే గడియించినయిండ్లుఁ గాణాచిచోట్లు యేడేడో
పొరలిన యిడుమలు యెందుకెక్కెనో పొదలితి భువిపై నిన్నాళ్లు
అరయఁగ నందరి కంతర్యామిని అఖిలకారణంబును నీవే
నిరతపు శ్రీవేంకటేశ్వర దయగల నీచిత్త మెటువలెఁ దలచీనో   ॥ అన్ని ॥

Pallavi

Anniyu naḍugavē nēnē maṟaciti navi hari nīkē telisinavi
mannin̄ci nā kījanma mosam̐gitivi marmagām̐ḍu manmathum̐ḍom̐kaḍu

Charanams

1.Palujanmambulu nēm̐ drāgina canum̐bālu golicitē nennaunō
talidaṇḍrulu mariyendarō tā mekkaḍa nunnārō
tilakimpam̐ga nāhārambunakunu teginakolucu lavi yennennō
yilapai nē bradikinakālamu yentani vrāsenō citraguptum̐ḍu

2.Cinum̐gam̐gam̐ jinum̐gam̐gam̐ gaṭṭukōkalakum̐ jellinapatti dā nadiyantō
kanaka mentō nākābharaṇamulai kāyambulatō norasinadi
penam̐gī ramin̄cina kāminīmaṇula pēru lenniyō tolliṭivi
ghanamuga nanu niṭu bhōgin̄cam̐jēsina karmamē yeṟum̐gu niviyellā

3.Garimala nē gaḍiyin̄cinayiṇḍlum̐ gāṇācicōṭlu yēḍēḍō
poralina yiḍumalu yendukekkenō podaliti bhuvipai ninnāḷlu
arayam̐ga nandari kantaryāmini akhilakāraṇambunu nīvē
niratapu śrīvēṅkaṭēśvara dayagala nīcitta meṭuvalem̐ dalacīnō


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.