Main Menu

Allavaade Vaadallavaade (అల్లవాఁడే వాఁడల్లవాఁడే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 49 | Keerthana 43 , Volume 6

Pallavi:Allavaade Vaadallavaade (అల్లవాఁడే వాఁడల్లవాఁడే)
ARO: Pending
AVA: Pending

Ragam: Goula
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అల్లవాఁడే వాఁడల్లవాఁడే
యెల్లలోకములకుఁ దానేలికైనవాఁడు       ॥ పల్లవి ॥

దొడ్డమేఁక పొలగూడు దోమటి దొడికినాఁడు
గడ్డువయసగు బిడ్డగన్నవాఁడు
నడ్డి ముక్కుతోడ వెఱ్ఱి నవ్వులు నవ్వినవాఁడు
అడ్డపాపఁడై యున్న ఆకుమీఁదివాఁడు       ॥ అల్ల ॥

ఆలి యిల్లు బొడ్డుతోడ నంటఁగట్టుకొన్నవాఁడు
కోలలేక లోకమెల్లఁ గొలిచినాఁడు
కాలువగా మింటి నీరు కాలఁదన్ని తీసినాఁడు
నేలకింది పరపుపై నెలకొన్నవాఁడు        ॥ అల్ల ॥

మించుల మించుల వన్నె మెకము నేసినవాఁడు
దంచేటి కైదువచేఁదనరువాఁడు
కంచముగా గొల్లవారి కడవలపాలెల్ల
వంచుకొని దోసిట వారవట్టువాఁడు        ॥ అల్ల ॥

పోటుమీరిన యసురపురము లిన్నియుఁ జొచ్చి
వీటిబుచ్చి దుమ్ములుగా వేసినవాఁడు
బూటకపు సురలతోఁ బున్నమ కప్పురమున
కూటువగాఁ జాపకూడు గుడిచినవాఁడు      ॥ అల్ల ॥

అల్లిందామరల పొందులైన కన్నులవాఁడు
తల్లిఁ గూఁతుఁ గౌఁగిటఁ దగిలినాఁడు
చల్లనైన వేంకట శైలముపై నున్న
నల్లని మేనివాఁడు నవ్వుమోమువాఁడు      ॥ అల్ల ॥

Pallavi

Allavām̐ḍē vām̐ḍallavām̐ḍē
yellalōkamulakum̐ dānēlikainavām̐ḍu

Charanams

1.Doḍḍamēm̐ka polagūḍu dōmaṭi doḍikinām̐ḍu
gaḍḍuvayasagu biḍḍagannavām̐ḍu
naḍḍi mukkutōḍa veṟṟi navvulu navvinavām̐ḍu
aḍḍapāpam̐ḍai yunna ākumīm̐divām̐ḍu

2.Āli yillu boḍḍutōḍa naṇṭam̐gaṭṭukonnavām̐ḍu
kōlalēka lōkamellam̐ golicinām̐ḍu
kāluvagā miṇṭi nīru kālam̐danni tīsinām̐ḍu
nēlakindi parapupai nelakonnavām̐ḍu

3.Min̄cula min̄cula vanne mekamu nēsinavām̐ḍu
dan̄cēṭi kaiduvacēm̐danaruvām̐ḍu
kan̄camugā gollavāri kaḍavalapālella
van̄cukoni dōsiṭa vāravaṭṭuvām̐ḍu

4.Pōṭumīrina yasurapuramu linniyum̐ jocci
vīṭibucci dum’mulugā vēsinavām̐ḍu
būṭakapu suralatōm̐ bunnama kappuramuna
kūṭuvagām̐ jāpakūḍu guḍicinavām̐ḍu

5.Allindāmarala pondulaina kannulavām̐ḍu
tallim̐ gūm̐tum̐ gaum̐giṭam̐ dagilinām̐ḍu
callanaina vēṅkaṭa śailamupai nunna
nallani mēnivām̐ḍu navvumōmuvām̐ḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.