Main Menu

AmtavAni KimtasEya (అంతవాని కింతసేయ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 220 | Keerthana 113 , Volume 3

Pallavi: AmtavAni KimtasEya (అంతవాని కింతసేయ)
ARO: Pending
AVA: Pending

Ragam: Dhannasi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతవాని కింతసేయ నమరునటే
వింతలు యీసుద్దులకే వెరగయ్యీ మాకు    ॥ పల్లవి ॥

కదిసి బ్రహ్మాండములు గర్భములోనున్నదేవుఁ-
డిదె దేవకి గర్భాన నెట్టు పుట్టెనే
అదె మఱ్ఱాకుమీఁదట నటు పవ్వళించువాఁడు
యెదుట యశోదచేత నెట్టు వినోదించీనే    ॥ అంత ॥

అడుగులుమూఁట లోకాలటు గొలచినవాఁడు
బడిబడి రేపల్లెఁ బారాడీని
అడరి యజ్ఞభాగము లారగించే దేవుఁడు
సడితో వెన్న ముచ్చిలి చవిగొనీనిదివో    ॥ అంత ॥

వేదపల్లవములందు విహరించే దేవుఁడు
సాదుగొల్లెతల రతిసంగడిఁ జిక్కె
మోదపు వైకుంఠాన ముదమందే కృష్ణుడు
యీదెస శ్రీవేంకటాద్రి నిరవాయ నిదివో   ॥ అంత ॥


Pallavi

Antavāni kintasēya namarunaṭē
vintalu yīsuddulakē veragayyī māku

Charanams

1.Kadisi brahmāṇḍamulu garbhamulōnunnadēvum̐-
ḍide dēvaki garbhāna neṭṭu puṭṭenē
ade maṟṟākumīm̐daṭa naṭu pavvaḷin̄cuvām̐ḍu
yeduṭa yaśōdacēta neṭṭu vinōdin̄cīnē

2.Aḍugulumūm̐ṭa lōkālaṭu golacinavām̐ḍu
baḍibaḍi rēpallem̐ bārāḍīni
aḍari yajñabhāgamu lāragin̄cē dēvum̐ḍu
saḍitō venna muccili cavigonīnidivō

3.Vēdapallavamulandu viharin̄cē dēvum̐ḍu
sādugolletala ratisaṅgaḍim̐ jikke
mōdapu vaikuṇṭhāna mudamandē kr̥ṣṇuḍu
yīdesa śrīvēṅkaṭādri niravāya nidivō


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.