Main Menu

Anuchu Bogada (అనుచు బొగడ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 340 | Keerthana 234 , Volume 4

Pallavi: Anuchu Bogada (అనుచు బొగడ)
ARO: Pending
AVA: Pending

Ragam:Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అనుచుఁ బొగడఁ జొచ్చేరదె బ్రహ్మాదులు మింట
మొనసి యీ బాలునికే మొక్కేము నేము  ॥ పల్లవి ॥

వున్నతపు లోకములు వుదరాన నున్నవాఁడు
అన్నువ నీ దేవకిగర్భమందు వుట్టెను
మన్నించి యోగీంద్రులమదిలోనుండెడువాఁడు
పన్నిన పొత్తులలోన బాలుఁడై వున్నాఁడు   ॥ అను ॥

పాలజలధిలోన పాయనిగోవిందుఁడు
పాలు వెన్న లారగించె పైఁడికోరను
వోలిఁ దన విష్ణుమాయ నోలలాడినట్టివాఁడు
చాలి మంత్రసానులచే జలకమాడీని    ॥ అను ॥

ముగురువేల్పులకు మూలమైన యట్టివాఁడు
తగుబలభద్రునికి తమ్ముఁడాయను
నిగిడి వైకుంఠమున నిలిచి రేపల్లెనుండి
యెగువ శ్రీవేంకటాద్రి నిరవాయ వీఁడే  ॥ అను ॥

Pallavi

Anucum̐ bogaḍam̐ joccērade brahmādulu miṇṭa
monasi yī bālunikē mokkēmu nēmu

Charanams

1.Vunnatapu lōkamulu vudarāna nunnavām̐ḍu
annuva nī dēvakigarbhamandu vuṭṭenu
mannin̄ci yōgīndrulamadilōnuṇḍeḍuvām̐ḍu
pannina pottulalōna bālum̐ḍai vunnām̐ḍu

2.Pālajaladhilōna pāyanigōvindum̐ḍu
pālu venna lāragin̄ce paim̐ḍikōranu
vōlim̐ dana viṣṇumāya nōlalāḍinaṭṭivām̐ḍu
cāli mantrasānulacē jalakamāḍīni

3.Muguruvēlpulaku mūlamaina yaṭṭivām̐ḍu
tagubalabhadruniki tam’mum̐ḍāyanu
nigiḍi vaikuṇṭhamuna nilici rēpallenuṇḍi
yeguva śrīvēṅkaṭādri niravāya vīm̐ḍē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.