Main Menu

Amdari Rakshimchedevudu (అందరి రక్షించేదేవుడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 170 | Keerthana 343 , Volume 2

Pallavi: Amdari Rakshimchedevudu (అందరి రక్షించేదేవుడు)
ARO: Pending
AVA: Pending

Ragam: Hindola Vasantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరి రక్షించే దేవుఁ డాదరించీ జీవులను
పొందుగా యీమేలెరిఁగి పొగడరో లోకులు    ॥ పల్లవి ॥

వనము వెట్టినవాఁడు వాఁడకుండా నీరు వోసి
పెనచి కలుపు దీసి పెంచినయట్లు
పనివడి గొల్లవాఁడు పచ్చికపట్టునఁ బసుల
తనియఁగ నిల్పి నిల్పి తానే మేపినట్లు      ॥ అంద ॥

కన్నతల్లి బిడ్డలకు కానుక వెన్నయుఁ బాలు-
నన్నము నిడి రక్షించినటువలెను
యెన్నఁగ బంట్లనేలే యేలిక జీతాలు వెట్టి
మన్నించి కాచుకొని మనిపినయట్లు        ॥ అంద ॥

వసుధ వైద్యుఁడైనవాడు మందుమాకు లిచ్చి
పొసఁగ దేహధారులఁ బోషించినట్లు
యెసఁగ శ్రీవేంకటేశుఁ డితఁడే విశ్వకుటింబి
పసగా వరము లిచ్చి భావించీనట్లు       ॥ అంద ॥


Pallavi

Andari rakṣin̄cē dēvum̐ ḍādarin̄cī jīvulanu
pondugā yīmēlerim̐gi pogaḍarō lōkulu

Charanams

1.Vanamu veṭṭinavām̐ḍu vām̐ḍakuṇḍā nīru vōsi
penaci kalupu dīsi pen̄cinayaṭlu
panivaḍi gollavām̐ḍu paccikapaṭṭunam̐ basula
taniyam̐ga nilpi nilpi tānē mēpinaṭlu

2.Kannatalli biḍḍalaku kānuka vennayum̐ bālu-
nannamu niḍi rakṣin̄cinaṭuvalenu
yennam̐ga baṇṭlanēlē yēlika jītālu veṭṭi
mannin̄ci kācukoni manipinayaṭlu

3.Vasudha vaidyum̐ḍainavāḍu mandumāku licci
posam̐ga dēhadhārulam̐ bōṣin̄cinaṭlu
yesam̐ga śrīvēṅkaṭēśum̐ ḍitam̐ḍē viśvakuṭimbi
pasagā varamu licci bhāvin̄cīnaṭlu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.