Main Menu

Adavichaatuna Numdi (అడవిచాటున నుండి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 57 | Keerthana 96 , Volume 6

Pallavi:Adavichaatuna Numdi (అడవిచాటున నుండి)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడవిచాటున నుండి యాఁటదానను న-
న్నుడికించేవేరా నీ వుడుకునను     ॥ పల్లవి ॥

పించెపుఁ బయ్యెదలోని పెనుగుబ్బలు మూయుచు
చెంచెత యేల యేఁచేవె చెల్లఁబో నన్ను
మంచుఁబులకలచాటు మగనాలిగుబ్బలు సో
ధించి చూచే వేరా తెట్టఁదెరువునను    ॥ అడవి ॥

తొలుకరి మెఱుఁగుల తొడలయాకుఁజీరచె
నలయించే వేఁటికి నీ వయ్యో నన్ను
నులివెచ్చమాటల నొవ్వ నామనము సోఁకఁ
బలికే వదేర బట్టబాయిటను        ॥ అడవి ॥

చిక్కనితేనెలతావి చిగురుమోవి నవ్వుచు
చక్కఁజూడ కేల పగచాటేవె నన్ను
చక్కని వేంకటగిరిస్వామి నాకౌఁగిలి నీకు
పుక్కట దొరకె పొట్టఁబొరుగుననూ     ॥ అడవి ॥

Pallavi

Aḍavicāṭuna nuṇḍi yām̐ṭadānanu na-
nnuḍikin̄cēvērā nī vuḍukunanu

Charanams

1.Pin̄cepum̐ bayyedalōni penugubbalu mūyucu
cen̄ceta yēla yēm̐cēve cellam̐bō nannu
man̄cum̐bulakalacāṭu maganāligubbalu sō
dhin̄ci cūcē vērā teṭṭam̐deruvunanu

2.Tolukari meṟum̐gula toḍalayākum̐jīrace
nalayin̄cē vēm̐ṭiki nī vayyō nannu
nuliveccamāṭala novva nāmanamu sōm̐kam̐
balikē vadēra baṭṭabāyiṭanu

3.Cikkanitēnelatāvi cigurumōvi navvucu
cakkam̐jūḍa kēla pagacāṭēve nannu
cakkani vēṅkaṭagirisvāmi nākaum̐gili nīku
pukkaṭa dorake poṭṭam̐borugunanū


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.