Main Menu

Aape Nanduno Ninnu (ఆపె నందునో నిన్ను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 251 | Keerthana 4 , Volume 9

Pallavi: Aape Nanduno Ninnu (ఆపె నందునో నిన్ను)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆపె నందునో నిన్ను నందునో యీ చేఁతలకు
యేపున వూరెల్లా పొందు లింతగాఁ జేసితివి  ॥ పల్లవి ॥

యిద్దర మేకతమాడె యీవేళ మనవద్ద
గుద్దిరాన నాపె వచ్చి కూచున్నది
దిద్దరాదా అప్పేమైనఁ దీసుకొంటేఁ గనక నీ
విద్దెస సతుల కస మింతగా నిచ్చితివి     ॥ ఆపె ॥

లోనికేఁగి నీవు నేను లోలత నవ్వుచుండఁగా
తానువచ్చి నీకుఁబాదము లొత్తీని
సేనగా నియ్యఁగరాదా జీఁతము చిక్కితేఁగన
యీ నెపాన మందెమేళ మింతగాఁ జేసితివి  ॥ ఆపె ॥

వోరిచి ముసుఁగు వెట్టు కొగి నిన్నుఁ గూడితేను
పేరున శ్రీవెంకటేశ పిలిచీ నాపె
యీరాదా ఆపె సొమ్ము లెత్తుక వచ్చితేఁగన
యీరీతి చనవు లిచ్చి యింతగాఁ బెంచితివి ॥ ఆపె ॥

Pallavi

Āpe nandunō ninnu nandunō yī cēm̐talaku
yēpuna vūrellā pondu lintagām̐ jēsitivi

Charanams

1.Yiddara mēkatamāḍe yīvēḷa manavadda
guddirāna nāpe vacci kūcunnadi
diddarādā appēmainam̐ dīsukoṇṭēm̐ ganaka nī
viddesa satula kasa mintagā niccitivi

2.Lōnikēm̐gi nīvu nēnu lōlata navvucuṇḍam̐gā
tānuvacci nīkum̐bādamu lottīni
sēnagā niyyam̐garādā jīm̐tamu cikkitēm̐gana
yī nepāna mandemēḷa mintagām̐ jēsitivi

3.Vōrici musum̐gu veṭṭu kogi ninnum̐ gūḍitēnu
pēruna śrīveṅkaṭēśa pilicī nāpe
yīrādā āpe som’mu lettuka vaccitēm̐gana
yīrīti canavu licci yintagām̐ ben̄citivi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.