Main Menu

Amduke Veracheno Yammalaalaa (అందుకే వెఱచేనో యమ్మలాలా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 60 | Keerthana 114 , Volume 6

Pallavi:Amduke Veracheno Yammalaalaa (అందుకే వెఱచేనో యమ్మలాలా)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే వెఱచేనో యమ్మలాలా తన
కందువకే పారఁబోయి కాలుజారె బిడ్డఁడు   ॥ పల్లవి ॥

పాలకడవలును బానలవెన్నలును
ఓలిం బెట్టి వుట్లపై నుండంగాను
నేలనుండి యెగసి నిక్కితీసె నిదివో
పాలు గాసు సేయ విడి పడఁబోయె బిడ్డఁడు   ॥ అందుకే ॥

కమ్మని నేతులును గడ్డల జున్నులును
కమ్మి వెద్దకాఁగులతో కాఁగంగాను
దిమ్మరియై తొడికి తియ్యం బోయీ నిదివో
అమ్మరో వ్రేళ్లు పొక్కి అగ్గిదాఁకి బిడ్డఁడు    ॥ అందుకే ॥

కోడెలఁ బేయలను కూడఁగట్టి విడిచి
వోడక వీథులం బరువులు దోలీని
వేడుక కాఁ డిదెవో వేంకటేశ్వరుఁడు
ఆడకు నీడకుఁ బాఱి అలసీని బిడ్డఁడు    ॥ అందుకే ॥


Pallavi

Andukē veṟacēnō yam’malālā tana
kanduvakē pāram̐bōyi kālujāre biḍḍam̐ḍu

Charanams

1.Pālakaḍavalunu bānalavennalunu
ōliṁ beṭṭi vuṭlapai nuṇḍaṅgānu
nēlanuṇḍi yegasi nikkitīse nidivō
pālu gāsu sēya viḍi paḍam̐bōye biḍḍam̐ḍu

2.Kam’mani nētulunu gaḍḍala junnulunu
kam’mi veddakām̐gulatō kām̐gaṅgānu
dim’mariyai toḍiki tiyyaṁ bōyī nidivō
am’marō vrēḷlu pokki aggidām̐ki biḍḍam̐ḍu

3.Kōḍelam̐ bēyalanu kūḍam̐gaṭṭi viḍici
vōḍaka vīthulaṁ baruvulu dōlīni
vēḍuka kām̐ ḍidevō vēṅkaṭēśvarum̐ḍu
āḍaku nīḍakum̐ bāṟi alasīni biḍḍam̐ḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.