Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 119 | Keerthana 112 , Volume 2
Pallavi:Ahobaleswaruda (అహోబలేశ్వరుడ)
ARO: Pending
AVA: Pending
Ragam:Nata
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Ahobaleswarudu | అహోబలేశ్వరుడు
Voice:G.Bala Krishna Prasad
Awaiting Contributions.
అహోబలేశ్వరుఁ డరికులదమనుఁడు
మహామహిమలను మలసీ వాఁడె ॥ పల్లవి ॥
కదలుఁగన్నులును కరాళవదనము
గుదిగొనుభయదపుఁగోరలును
అదరుమీసములు నలరఁగ నవ్వుచు
వుదుటుతోడఁ గొలువున్నాఁడు వీఁడె ॥ అహో ॥
అతిసితనఖములు ననంతభుజములు
వితతపరాక్రమవేషమును
అతులదీర్ఘ జిహ్వయుఁ గడు మెరయఁగ
మితిలేనికరుణ మెరసీ వాఁడే ॥ అహో ॥
సందడిసొమ్ములు శంఖచక్రములు
పొందుగ దివిజులు పొగడఁగను
యిందిరఁ దొడపై నిడి శ్రీవేంకట –
మందు నిందుఁ గడు నలరీ వాఁడే ॥ అహో ॥
Pallavi
ahObalESvaru DarikuladamanuDu
mahAmahimalanu malasI vADe
Charanams
1.kadalugannulunu karALavadanamu
gudigonubhayadapugOralunu
adarumIsamulu nalaraga navvuchu
vuduTutODa goluvunnADu vIDe
2.atisitanakhamulu nanaMtabhujamulu
vitataparAkramavEShamunu
atuladIrgha jihvayu gaDu merayaga
mitilEnikaruNa merasI vADE
3.saMdaDisommulu SaMkhachakramulu
poMduga divijulu pogaDaganu
yiMdira doDapai niDi SrIvEMkaTa
maMdu niMdu gaDu nalarI vADE
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.