Main Menu

Anniyu Gane Gaaka Appati Nenu (అన్నియు గనే గాక అప్పటి నేను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 408 | Keerthana 46 , Volume 12

Pallavi: Anniyu Gane Gaaka Appati Nenu (అన్నియు గనే గాక అప్పటి నేను)
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియుఁ గనేఁ గాక అప్పటి నేను
యెన్నరాని వేడుకల నెందు వోయే నేనూ ॥ పల్లవి ॥

అతి వేషముల నీవు అన లెల్లాఁ బెట్టు కోఁ గా
పతి మాటలాడ నాకుఁ బంతమా నీతో
జతనాన నీ గుణము చక్క నుంటేఁ జాలుఁ గాక
గతి నీవే అది నా భాగ్యము గాదా      ॥ అన్ని ॥

తగవు లుపచరించి తారుకాణకు రాఁ గాను
జగడించ నాకు నేఁడు చలమా నీతో
వగదీర నీవె నావద్ద నుంటేఁ జాలుఁ గాక
తెగని నాపాలిటి దేవరవు గావా      ॥ అన్ని ॥

మచ్చిక కౌఁగిటి నించి మంచ మెక్కు మనఁగాను
హెచ్చి నిన్ను దోయఁగ నే నెదురా నీతో
అచ్చమై శ్రీ వేంకటేశ అట్టే నన్నుఁ గూడితివి
కొచ్చి కొచ్చి నేఁ గోరిన కోరి కిదే కాదా.   ॥ అన్ని ॥

Pallavi

Anniyum̐ ganēm̐ gāka appaṭi nēnu
yennarāni vēḍukala nendu vōyē nēnū

Charanams

1.Ati vēṣamula nīvu ana lellām̐ beṭṭu kōm̐ gā
pati māṭalāḍa nākum̐ bantamā nītō
jatanāna nī guṇamu cakka nuṇṭēm̐ jālum̐ gāka
gati nīvē adi nā bhāgyamu gādā

2.Tagavu lupacarin̄ci tārukāṇaku rām̐ gānu
jagaḍin̄ca nāku nēm̐ḍu calamā nītō
vagadīra nīve nāvadda nuṇṭēm̐ jālum̐ gāka
tegani nāpāliṭi dēvaravu gāvā

3.Maccika kaum̐giṭi nin̄ci man̄ca mekku manam̐gānu
hecci ninnu dōyam̐ga nē nedurā nītō
accamai śrī vēṅkaṭēśa aṭṭē nannum̐ gūḍitivi
kocci kocci nēm̐ gōrina kōri kidē kādā.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.