Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 266 | Keerthana 379 , Volume 3
Pallavi: Anniyu Naayamde Kamti Nannitivaadaa (అన్నియు నాయందే కంటి నన్నిటివాడా)
ARO: Pending
AVA: Pending
Ragam:Malavi
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అన్నియు నాయందే కంటి నన్నిటివాఁడా నేనే
మున్నె నా భావముతో ముడిచివేసినది ॥ పల్లవి ॥
చెలఁగి సంసారమే చింతించి సంసారినైతి
ములిగి ముక్తిదలఁచి ముక్తుఁడనైతి
పలుమతాలు దలఁచి పాషండబుద్ధినైతి
చెలఁగి శ్రీపతిఁ దలఁచి వైష్ణవుఁడనైతి ॥ అన్ని ॥
పొసఁగఁ బుణ్యము సేసి పుణ్యాత్ముఁడనైతి
పసలఁ బాపముచేసి పాపకర్ముఁడనైతి
వెస బ్రహ్మచారినైతి వేరె యాచారమున
ముసిపి మరొకాచారమున సన్యాసినైతి ॥ అన్ని ॥
వొగి నొడ్డెభాషలాఁడి వొడ్డెవాఁడనైతిని
తెగి తెలుఁగాడ నేర్చి తెలుఁగువాడనైతి
అగడై శ్రీవేంకటేశ అన్నియు విడిచి నేను
తగు నీదాఁసుడనై దాసరి నేనైతి ॥ అన్ని ॥
Pallavi
Anniyu nāyandē kaṇṭi nanniṭivām̐ḍā nēnē
munne nā bhāvamutō muḍicivēsinadi
Charanams
1.Celam̐gi sansāramē cintin̄ci sansārinaiti
muligi muktidalam̐ci muktum̐ḍanaiti
palumatālu dalam̐ci pāṣaṇḍabud’dhinaiti
celam̐gi śrīpatim̐ dalam̐ci vaiṣṇavum̐ḍanaiti
2.Posam̐gam̐ buṇyamu sēsi puṇyātmum̐ḍanaiti
pasalam̐ bāpamucēsi pāpakarmum̐ḍanaiti
vesa brahmacārinaiti vēre yācāramuna
musipi marokācāramuna san’yāsinaiti
3.Vogi noḍḍebhāṣalām̐ḍi voḍḍevām̐ḍanaitini
tegi telum̐gāḍa nērci telum̐guvāḍanaiti
agaḍai śrīvēṅkaṭēśa anniyu viḍici nēnu
tagu nīdām̐suḍanai dāsari nēnaiti
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.