Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 515 | Keerthana 87 , Volume 13
Pallavi:Amanipuvvuvamtidi Ayamaina (ఆమనిపువ్వువంటిది ఆయమైన)
ARO: Pending
AVA: Pending
Ragam:Sankarabharanam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
ఆమనిపువ్వువంటిది ఆయమైన వయసు
కామించి భోగించక యా(యే?)మరఁదగునా ॥ పల్లవి ॥
చలపాదితనమేల సణఁగులాడఁగనేల
బలిమిఁ బెనఁగేయట్టి పతితోను
పలుకరాదా కప్రపుబాగా లియ్యఁగరాదా
చెలులకు నింతేసి సిగ్గువడఁదగునా ॥ ఆమ ॥
బిగియఁగ నింతయేల పెచ్చువెరుగఁగనేల
పగటునఁ దమకించే పతితోను
నగవులు నగరాదా నయములు చూపరాదా
చిగురుమోవితోడ సిగ్గువడఁదగునా ॥ ఆమ ॥
మరిగించ నింతయేల మనసులు చూడనేల
పరగ శ్రీ వేంకటపతితోను
గరిమెల మెచ్చరాదా కాఁగిటఁగూడె నతఁడు
శిరసువంచుక యట్టె సిగ్గువడఁదగునా ॥ ఆమ ॥
Pallavi
Āmanipuvvuvaṇṭidi āyamaina vayasu
kāmin̄ci bhōgin̄caka yā(yē?)Maram̐dagunā
Charanams
1.Calapāditanamēla saṇam̐gulāḍam̐ganēla
balimim̐ benam̐gēyaṭṭi patitōnu
palukarādā kaprapubāgā liyyam̐garādā
celulaku nintēsi sigguvaḍam̐dagunā
2.Bigiyam̐ga nintayēla peccuverugam̐ganēla
pagaṭunam̐ damakin̄cē patitōnu
nagavulu nagarādā nayamulu cūparādā
cigurumōvitōḍa sigguvaḍam̐dagunā
3.Marigin̄ca nintayēla manasulu cūḍanēla
paraga śrī vēṅkaṭapatitōnu
garimela meccarādā kām̐giṭam̐gūḍe natam̐ḍu
śirasuvan̄cuka yaṭṭe sigguvaḍam̐dagunā
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.