Main Menu

Adukoku Neekuneeve Antesi (ఆడుకోకు నీకునీవే అంతేసి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 238 | Keerthana 227 , Volume 8

Pallavi: Adukoku Neekuneeve Antesi (ఆడుకోకు నీకునీవే అంతేసి)
ARO: Pending
AVA: Pending

Ragam:Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడుకోకు నీకు నీవే అంతేసి పంతాలు
జాడతోడ మరినవె చాలునయ్య యిఁకను     ॥ పల్లవి ॥

నిగమములై తేను నిలువఁ బెట్టేవాడవు
మగువలతోఁ గల్ల మాటలాడేవా
అగడై అసురకాంతలందుకు సాకిరున్నారు
జగతి సత్యము లవె చాలునయ్యా యిఁకను    ॥ ఆడు ॥

పెరిమ యజ్ఞభాగాలు పెద్దవై ఆరగించేవు
అరిది వెన్నలు ముచ్చి లారగించేవా
యిరవై గొల్లెతలెల్లా నిందుకు సాకిరున్నారు
సరి నట్టి విశ్వాసాలె చాలునయ్య యిఁకను    ॥ ఆడు ॥

జమళి నవ్వుతా నాకు చాఁచె హస్తాలు నీవి
కొమరెలనంటి యెత్తుకొని వచ్చేవా
సమరతి రుకుమిణి సాకిరి శ్రీవెంకటేశ
సముకమైతిమి బొంకుచాలునయ్య యిఁకను  ॥ ఆడు ॥

Pallavi

Āḍukōku nīku nīvē antēsi pantālu
jāḍatōḍa marinave cālunayya yim̐kanu

Charanams

1.Nigamamulai tēnu niluvam̐ beṭṭēvāḍavu
maguvalatōm̐ galla māṭalāḍēvā
agaḍai asurakāntalanduku sākirunnāru
jagati satyamu lave cālunayyā yim̐kanu

2.Perima yajñabhāgālu peddavai āragin̄cēvu
aridi vennalu mucci lāragin̄cēvā
yiravai golletalellā ninduku sākirunnāru
sari naṭṭi viśvāsāle cālunayya yim̐kanu

3.Jamaḷi navvutā nāku cām̐ce hastālu nīvi
komarelanaṇṭi yettukoni vaccēvā
samarati rukumiṇi sākiri śrīveṅkaṭēśa
samukamaitimi boṅkucālunayya yim̐kanu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.