Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 297 | Keerthana 562 , Volume 3
Pallavi: Amtayu Natanimahaamahime (అంతయు నతనిమహామహిమే)
ARO: Pending
AVA: Pending
Ragam:Gundakriya
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అంతయు నతని మహామహిమే అతఁ-
డెంత సేసినా నెట్టయిన నవును ॥ పల్లవి ॥
రావలెనన్నవి రాకమానవు
పోవలె నన్నవి పోకుండవు
ఆవల నీవల నలమటలేఁటికి
దైవమొక్కఁడే తగిలిన గుఱుతు ॥ అంత ॥
కాయపు గుణములు కలిగినవే భువి-
నీ యెడ జీవుఁడు యిటు గలఁడే
ఆయమిందుఁ గా దవునన నెవ్వరు
కాయజగురుఁ డొక్కఁడే ప్రేరకుఁడు ॥ అంత ॥
అంతరంగమే యాత్మజ్ఞానము
వింతగు వెలుపల వెడమాయ
చింతించి రక్షించ శ్రీవేంకటేశుఁడు
మంతుకెక్కె నిఁక మతకములేల ॥ అంత ॥
Pallavi
Antayu natani mahāmahimē atam̐-
ḍenta sēsinā neṭṭayina navunu
Charanams
1.Rāvalenannavi rākamānavu
pōvale nannavi pōkuṇḍavu
āvala nīvala nalamaṭalēm̐ṭiki
daivamokkam̐ḍē tagilina guṟutu
2.Kāyapu guṇamulu kaliginavē bhuvi-
nī yeḍa jīvum̐ḍu yiṭu galam̐ḍē
āyamindum̐ gā davunana nevvaru
kāyajagurum̐ ḍokkam̐ḍē prērakum̐ḍu
3.Antaraṅgamē yātmajñānamu
vintagu velupala veḍamāya
cintin̄ci rakṣin̄ca śrīvēṅkaṭēśum̐ḍu
mantukekke nim̐ka matakamulēla
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.